క్రీడలపై ప్రభుత్వం చిన్నచూపు!

The government looks down on sports!– 1600 పీఈటీ పోస్టులు మంజూరు చేయాలి
హైదరాబాద్‌: మెగా డిఎస్సీలో వ్యాయాయ విద్య ఉపాధ్యాయుల పోస్టులను 182 మాత్రమే భర్తీ చేయటం క్రీడలపై రాష్ట్ర ప్రభుత్వం చిన్నచూపు చూడటమేనని ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్స్‌ అసోసియేషన్‌ (తెలంగాణ) అధ్యక్ష, కార్యదర్శులు బి. రాఘవరెడ్డి, పి. కృష్ణమూర్తి గౌడ్‌ అన్నారు. రాష్ట్రంలో ఉన్నత పాఠశాలలు, ప్రాథమికోన్న పాఠశాలలలో కనీసం 1600 పీఈటీ పోస్టులను మంజూరు చేసి ఈ మెగా డిఎస్సీలోనే భర్తీ చేయాలని పెటా టిఎస్‌ సంఘం నేతలు కోరారు. ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ పట్టా పొందిన 90,000 మంది పీఈటీ నిరుద్యోగ అభ్యర్థులకు న్యాయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించారు.