– భయాందోళనలో అధికారుల విధులు
నవతెలంగాణ-కౌటాల
మండల కేంద్రంలోని ప్రభుత్వ కార్యాలయాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. 1992లో పిల్లర్లు లేకుండా నిర్మాణాలు చేపట్టి స్లాబులు వేశారు. నాణ్యత లోపామా..? భవన నిర్మాణాల గడువు తిరిందా..? అన్నట్టుగా గోడలు నెర్రలు బాసి రెండు భవనాల స్లాబుల పెచ్చులుడిపోతున్నాయి. వర్షం కురిసిందంటే ఉరుస్తున్నాయి. ఆ శిథిలావస్థవకు చేరుకున భవనాల్లో ఎంపీడీఓ, తహసీల్దార్ కార్యాలయాలో కొనసాగుతున్నాయి. వీటిపై గతంలో పని చేసిన తహసీల్దార్లు ఎంపీడీఓలు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లిన స్పందిన లేకుండా పోయింది. రెండు కార్యాలయాల్లో నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజా సమస్యలు పరిష్కరించాల్సిన అధికారులకు భరోసా లేకుండా పోతోంది. ప్రభుత్వ కార్యాలయాలు శిథిలావస్థకు చేరుకోవడంతో అధికారులు భయం గుప్పిట్లో విధులు నిర్వహించాల్సిన పరిస్థితి. నిత్యం ప్రజలతో రద్దీగా ఉండే ఎంపీడీఓ, తహీసల్దార్ కార్యాలయాలు పూర్తిగా శిథిలావస్థకు చేరుకున్నాయి. గత సంవత్సరం తహసీల్దార్ కార్యాలయం స్లాబు రెండు ఇంచుల మందం మొత్తం ఒ పక్కగు జరిగింది. నెర్రలు వాసింది. ఈ దృశ్యాన్ని చూసిన అందులో రాత్రి పూజ రోజు ఇద్దరి చొప్పున పడుకునే అప్పటి వీఆర్‌ఏలు, ప్రస్తుత సబ్ అర్డినేటర్ సైతం కాపల ఉండడం లేదు. ఏ ప్రమాదం జరుగుతోందనని భయంతో విధులు నిర్వహిస్తున్నారు. ఇప్పటికైన తెలంగాణ ప్రభుత్వం స్పందించి శిథిలావస్థకు చేరుకున్న భవనాలను పరిశీలించి కొత్త భవనాల నిర్మించాలని కోరుతున్నారు.