– చలనం లేని ప్రభుత్వ ఘనం
– చక్రం తిప్పుతున్న ఓ మిల్ యజమాని
– పోలీసుల సహకారంతో మిల్లర్లు అడ్డదారి
నవతెలంగాణ – నసురుల్లాబాద్
ప్రతి సంవత్సరం వానాకాలం, యాసంగి సీజన్లలో కొన్న వడ్లను సివిల్ సప్లై ద్వారా ప్రభుత్వం ప్రవేట్ మిల్లింగ్‌కు ఇస్తుండగా.. వడ్లను గడువులోగా మిల్లు ఆడించి ఎఫ్సీఐ, సివిల్ సప్లై గోడౌన్లకు తరించవలసి ఉండగా కొందరు అక్రమంగా ఇతర జిల్లాల్లోని మిల్లులకు తరలించి ఎక్కువ రేటుకు అమ్ముకుంటున్నారు. ఇదే విషయమై బుధవారం బీర్కూర్ మండలం సాయి స్వరూప్ మిల్లు నుండి 40 కిలోల ధాన్యం బస్తాలను మార్పిడి చేసి 70 కిలోల సంచుల్లో నింపి లారీలో ఇతర జిల్లాలకు తరలిస్తుండగా గ్రామస్తులు పట్టుకొని నిలదీయగా తన వద్ద ఎలాంటి వే బిల్స్, పత్రాలు లేవని లారీ డ్రైవర్ సమాధానం ఇవ్వడంతో రెవెన్యూ శాఖ, మరియు పోలీసులకు అప్పగించారు. లారీలో 480 బస్తాలు ఉన్నట్లు లారీ డ్రైవర్ తెలిపాడు. రైస్ మిల్లు లో ధాన్యం అక్రమ రవాణా జరుగుతుందని సమాచారం మేరకు కొందరు వెళ్లగా రైస్ మిల్లు నుండి మధ్యాహ్న బైటకు వచ్చిన లారీ సాయంత్రం వరకు ఎలాంటి పత్రాలు లేక పోవటంతో పోలీసులకు అప్పగించారు. రైస్ మిల్ నుంచి అక్రమంగా తరలిస్తున్న ధాన్యం లారిని తిరిగి అదే రైస్ మిల్ కు వచ్చేలా కృషి చేసిన యజమాని. బీర్కూర్ లో ఓ రైస్ యజమాని చక్రం దింపడంతో అధికారులు యజమానికి కొమ్ముకాస్తున్నారంటూ బీర్కూర్ ప్రజలు ఆరోపిస్తున్నారు. గతంలో సీఎంఆర్ ధాన్యంను మాయం చేసినట్టు తేలినా ఇప్పటి వరకు రికవరీ చేయలేదు. దీన్ని అలుసుగా తీసుకున్న ఇతర మిల్లర్లు బియ్యాన్ని, మరియు ధాన్యంను ఇతర రాష్ట్రాల్లో అమ్ముకుంటున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. బీర్కూర్ మండలంలో ఉన్న మిల్లర్లు రూ.కోట్ల ధాన్యాన్ని ఇతర రాష్ట్రాలకు తరలిస్తూ సొమ్ముచేసుకుంటున్నా అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. మిల్లులకు ఇచ్చిన వడ్ల లెక్కలు చూడడంలో అధికారులు విఫలం చెందారని ఆరోపణలు ఉన్నాయి.
స్టాకు లేకున్నా ఉన్నట్టు మోసం..
రైతుల నుంచి వడ్లు కొన్న మిల్లర్లు మరాడించకుండా తమ వద్దే ఉంచుకుంటున్నారు. ధర పెరిగేదాకా ఉంచుకొని డిమాండ్ వచ్చాకా ఇతర రాష్ట్రాలకు అమ్ముకుంటున్నట్టు తెలుస్తోంది. ప్రభుత్వానికి అటు బియ్యం ఇవ్వకుండా మోసం చేయడమేకాకుండా మిల్లుల్లో స్టాకు లేకున్నా ఉన్నట్టు చూపిస్తున్నారు. రెవెన్యూ, సివిల్ సప్లై విజిలెన్స్ అధికారులకు అమ్యామ్యాలు ముట్ట జెప్పడంతో రికవరీ సరిగా జరగడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో మిల్లర్లు స్టాకు వివరాలు చెప్పకుండా కాలయాపన చేస్తూ ప్రభుత్వాన్ని చీటింగ్ చేస్తున్నట్టు విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం మిల్లుల్లో తనిఖీలు చేస్తే వాస్తవాలు బయట పెట్టాలని ప్రజలు కోరుతున్నారు. సివిల్ సప్లై ధాన్యం ఏ రైస్ మిల్ కు ఎంత కేటాయించింది ఎంత నిల్వ ఉంది వివరాలు స్టాక్ బోర్డుపై పెట్టాలని కోరుతున్నారు