
హస్టల్ విద్యార్థుల సమస్యలను పట్టించుకోకుండా ప్రభుత్వం గాలికి వదలి వేసిందని కేవీపీఎస్ జిల్లా నాయకులు దొంతాల నాగార్జున అన్నారు. గురువారం హస్టల్ సమస్యల సర్వే లో భాగంగా పెద్దవూర మండల కేంద్రంలోని ఎస్సీ బాలుర హాస్టల్ ను పరిశీలించారు.ఈ సందర్భంగా విద్యార్థులను అడిగి సమస్యలను తెలుసుకున్నారు.అనంతరం మాట్లాడుతూ పాఠశాలలు ప్రారంభమై నెలన్నర రోజులు అవుతున్న హాస్టల్ విద్యార్థులకు నోటు పుస్తకాలు దుప్పట్లు ఇవ్వలేదని అన్నారు. నేటి ధరల పెరుగుదల కనుగుణంగా కాస్మోటికి చార్జింగ్ 2500 రూపాయలకు పెంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ప్రతినెల విద్యార్థులకు హెల్త్ చెకప్ చేయించాలని విద్యార్థులు ఆడుకోవడానికి ఆట వస్తువులు ఏర్పాటు చేయాలని అన్నారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు విద్యార్థులను పట్టించుకోవడం లేదని విమర్శించారు. మెనూ ప్రకారం హాస్టల్లో వండి పెట్టడం లేదని అన్నారు. వార్డెన్ స్థానికంగా ఉండకపోవడం వలన విద్యార్థులను పట్టించుకునే నాధుడు లేరని అన్నారు. ఒకవేళ రాత్రిపూట కరెంటు పోతే అంధకారంలో విద్యార్థులు ఉండవలసి వస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కెవిపిఎస్ నాయకులు దోరేపల్లి మల్లయ్య విద్యార్థులు పాల్గొన్నారు