అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు

Government schemes for everyone who is eligible– పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభం చేసిన
– రాష్ట్ర ఐటి,పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబు
నవ తెలంగాణ మల్హర్ రావు.
అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా అధికారులు చూడాలని తెలంగాణ రాష్ట్ర ఐటి,పరిశ్రమల, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబు అన్నారు.బుధవారం మండలంలోని మల్లారం గ్రామంలో రూ.20 లక్షలతో నిర్మించనున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి, తాడిచర్ల గ్రామంలోని ఆర్ అండ్ ఆర్ కాలనీలో రూ.16 లక్షల రూపాయలతో నిర్మించనున్న అంగన్వాడీ కేంద్రానికి, రూ.4 కోట్లతో నిర్మించనున్న విద్యుద్దీకరణ పనులకు, తాడిచర్ల నుండి గోపాలపూర్ వరకు రూ.40 లక్షలతో చేపట్టిన రహదారి నిర్మాణ పనులకు, రూ.23 లక్షలతో నిర్మించనున్న అంతర్గత రహదారి నిర్మాణ పనులు, రూ.30 లక్షల 20 వెలతో చేపల విక్రయ 9 మంది లబ్ధిదారులకు ట్రాలీ ఆటోలు, రూ.19.50 లక్షలతో వైద్యాధికారి విశ్రాంతి భవనం, రూ.25 లక్షలతో గ్రంధాలయం తదితర వాటికి శంకుస్థాపన,ప్రారంభోత్సవం చేశారు. అనంతరం జిల్లా, మండల స్థాయి అధికారులతో ఏర్పాటు చేసిన రివ్యూ సమావేశంలో మంత్రి మాట్లాడారు గృహజోతి పతకంలో జీరో కరెంట్ బిల్లులపై, రూ.గ్యాస్ పై అరా తీశారు.అర్హులైన అందరికి విద్యుత్ జీరో బిల్లులు వచ్చేలా చూడాలని విద్యుత్ అధికారులను ఆదేశించారు. మారుమూల ప్రాంతాలు ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తున్నట్లుగా తెలిపారు.ప్రభుత్వం అధికారం రాగానే రూ.5 లక్షల రూపాయల ఆరోగ్య శ్రీ పథకాన్ని రూ.10 లక్షలు రూపాయలకు పెంచి కార్పొరేట్ వైద్య సేవలు అందిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. వేసవిలో మంచినీటి సమస్య రాకుండా తగు చర్యలు చేపట్టాలని ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. రానున్న వర్షాకాలం వరకు ఎలాంటి మంచినీటి సమస్య రాకుండా అధికారులు  కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని ఆయన సూచించారు.మంచినీటి సమస్య వస్తే చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా,ఎంపిపి మల్హర్ రావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు