ప్రభుత్వ పథకాలు అర్హులకు అందించాలి: సుధాకర్

నవతెలంగాణ పెద్దవంగర: అర్హులందరికీ ప్రభుత్వ పథకాలను అందించాలని బీజేపీ మండల అధ్యక్షుడు బొమ్మెరబోయిన సుధాకర్ యాదవ్ అన్నారు. శనివారం మండల కేంద్రంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలకు అర్హులైన వారిని ఎంపిక చేయాలన్నారు. కాంగ్రెస్ గొప్పగా చెపుతున్న హామీలన్నీ గ్యారెంటీ, వారంటీ లేని పథకాలని, ప్రజా సొమ్ము దోసుకొని, ప్రజలను ఇబ్బందులకు గురి చేయడమే తప్ప వాటివల్ల ఏమి ప్రయోజనం లేదన్నారు. బీజేపీ ఇస్తున్న హామీలు నిరుపేదలకు ఉపయోగపడే విదంగా ఉచిత విద్య, వైద్యం, న్యాయం అందరికీ చేరువయ్యే రీతిలో అమలు చేస్తుందన్నారు. రాబోయే ఎన్నికల్లో పాలకుర్తి నియోజకవర్గంలో బీజేపీ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం.