ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి

Government schemes should be taken to the people– టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్, మంత్రి దామోదర రాజనర్సింహ ను కలిసిన అత్తు ఇమామ్
నవతెలంగాణ – సిద్ధిపేట
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను అర్హులైన ప్రజలకు అందేలా చూడాలని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రి దామోదర రాజనర్సింహ  సూచించినట్లు కాంగ్రెస్ పార్టీ సిద్దిపేట పట్టణ అధ్యక్షుడు అత్తు ఇమామ్ తెలిపారు. హైదరాబాదులోని గాంధీభవన్ లో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ని, మంత్రి దామోదర రాజనర్సింహని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా అత్తు ఇమామ్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీతోనే తెలంగాణ అభివృద్ధి చెందుతుందని అన్నారు. అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరగాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం తోనే సాధ్యమవుతుందని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సూచనతో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో యువజన పట్టణ అధ్యక్షులు గయాజుద్దీన్ నజ్జు, మధు, అనిల్,  తదితరులు పాల్గొన్నారు.