నవతెలంగాణ – భీంగల్
మంగళవారం వెలువడిన పదవ తరగతి పరీక్ష ఫలితాలలో ప్రభుత్వ పాఠశాలల ప్రభంజనం కొనసాగింది. మండలంలో 22 పాఠశాలల్లో 19 పాఠశాలలు 100% ఉత్తీర్ణత సాధించాయి. ఇందులో ఐదుగురు విద్యార్థులు 10/10 సాదించగా ఇందులో నలుగురు ప్రభుత్వ పాఠశాలకు చెందిన విద్యార్థులు కావడం విశేషం. భీంగల్ పట్టణ కేంద్రంలోని జెడ్ పి హెచ్ ఎస్ కు చెందిన కే అపూర్వ, లిటిల్ ఫ్లవర్ కు చెందిన శబనం, ముచ్కూర్ జడ్.పి.హెచ్.ఎస్ కు చెందిన శ్రావన్య, సిహెచ్ శివాని, శ్రీవల్లి లు 10/10 సాధించారు. మండల మొత్తంగా 99 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు ఏమి స్వామి తెలిపారు.
లిటిల్ ఫ్లవర్ ప్రభంజనం
పట్టణ కేంద్రంలోని బాబాపూర్ రోడ్ లో గల లిటిల్ ఫ్లవర్ పాఠశాల కు చెందిన శబనం 10/10 సాధించి మండల టాప్ గా నిలిచింది. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ షఫీ, ఉపాధ్యాయ బృందం శబనం ను అభినందించారు. పాఠశాలలో 100 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు కరస్పాండెంట్ షఫీ తెలిపారు.
విద్యార్థినికి సన్మానం
పదవ తరగతి ఫలితాలలో 810 సాధించిన కే అపూర్వను ఎంఈఓ స్వామి ఆధ్వర్యంలో మండల విద్యా వనరుల కేంద్రంలో సన్మానించారు ఈ కార్యక్రమం లో ఉపాధ్యాయులు లింబాద్రి, రాములు, వినోద్, రాజకుమార్, ఎం ఆర్ సి సిబ్బంది రవి, దిలీప్, జెలందర్ పాల్గొన్నారు.