
ప్రభుత్వ పాఠశాలలో సంక్షేమ హాస్టల్స్ గురుకులాలలో ఫుడ్ పాయిజన్, వరుస ఘటనలపై ప్రభుత్వ మొండి వైఖరిని నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల బంద్ పిలుపులో భాగంగా శనివారం మండల పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలను పిడిఎస్యు ఆధ్వర్యంలో విజయవంతంగా బంద్ చేశారు. సందర్భంగా పి.డి.ఎస్.యు మండల నాయకులు ఉప్పుల మణికుమార్, మాట్లాడుతూ.. కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికీ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రిని నియమించకపోవడం పరిపాలన లోపం అని విద్య శాఖలో నిధులు కేవలం 8%నిధులు బడ్జెట్లో కేటాయించడం దుర్మార్గమని అన్నారు. అందుకనే ప్రభుత్వ విద్యాసంస్థల్లో వరుస ఫుడ్ పాయిజన్లు జరుగుతున్నాయని విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని, ప్రభుత్వ విద్యాసంస్థలు బలోపేతం చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు సాయి, నిఖిల్, సాయి విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.