– ప్రయివేటు పాఠశాలల ఫీజులను నియంత్రణ చేయాలి
– ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా మాజీ ఉపాధ్యక్షులు సిలివేరు రాజు
– బోడ కొండ, ఆంబోతు తండలో ఎస్‌ఎఫ్‌ఐ గ్రామ కమిటీలు ఎన్నిక
నవతెలంగాణ-రంగారెడ్డిడెస్క్
ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ మాజీ జిల్లా ఉపాధ్యక్షులు సిలివేరు రాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం మండల పరిధిలోని బోడ కొండ, ఎల్లమ్మ తండా గ్రామాల్లో ఎస్‌ఎఫ్‌ఐ గ్రామ కమిటీలు ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మీడియాతో ఎస్‌ఎఫ్‌ఐ విద్యార్థి సంఘం చదువుతూ పోరాడు చదువుకై పోరాడు అనే నినాదంతో స్వాతంత్య్రం, ప్రజా స్వామ్యం, సోషలిజం అనే లక్ష్యాలతో ముందుకు సాగుతుందని అన్నారు. ముఖ్యంగా ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలని, ప్రయివేటు పాఠశాలలో ఫీజుల నియంత్రణ చేయాలని, దాని కోసం చట్టం తేవాలని అన్నారు. పాఠశాలలు త్వరలోనే ప్రారంభం అవుతున్నందున విద్యార్థులకు సరిపడా ఉపాధ్యాయులు ఉండాలని, మధ్యాహ్నం బోజన పథకం సరిగ్గా అమలు చేయాలని, విద్యార్థులకు సరిపడా తరగతి గదులు, తాగు నీరు, మూత్ర శాలలు, సమయానికి బస్సు సౌకర్యం ఉండాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బోడకొండ గ్రామ అధ్యక్ష, కార్యదర్శులుగా గణేష్, శివ, ఆంబోతు తండ గ్రామ అధ్యక్ష కార్యదర్శులుగా సురేష్, బబ్లులను ఎన్నుకోవడం జరిగిందని తెలిపారు.