
ప్రభుత్వ బడులు నిలబడుటకు గ్రామ పంచాయితీ వార్డు మెంబర్, సర్పంచ్ నుండి రాష్ట్ర ముఖ్యమంత్రి వరకు ప్రజా ప్రతినిధులు, గ్రామ పంచాయితీ కార్యదర్శి నుండి ఛీఫ్ సెక్రెటరీ వరకు అధికారులు తమ వంతు కృషి చేయాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి కోరారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ బడులంటే, ప్రభుత్వ, మండల పరిషత్, జిల్లా పరిషత్, గిరిజన సంక్షేమ పాఠశాలలు మొత్తం ఇరవై ఏడు వేల పైగా ఉన్నాయి. వీటిలోనే దాదాపు ఇరవై లక్షల మంది విద్యార్థులు చదువుచున్నారు. ఈ పాఠశాలల్ని సరైన రీతిలో అభివృద్ధి చేస్తే, ఇంకనూ ఇరవై లక్షల మంది విద్యార్థులకు చదువు చెప్పవచ్చును. ఏ స్థాయి ప్రజా ప్రతినిదైనా, ఏ స్థాయి అధికారైనా మీమీ పర్యటనలో ఏదైనా ఒక ప్రభుత్వ బడిని పర్యవేక్షణాధికారిగా కాకుండా, సందర్శకులుగా వెళ్ళి చూడాలని కోరుతున్నాను. ఆ పాఠశాలలో ఏమి చేస్తే తల్లిదండ్రులు ఆ పాఠశాలకు పంపుతారో పరిశీలించండి. అట్టి చర్యలు తీసుకోవడానికి అవసరమైన సూచనలు, సలహాలు విద్యాశాఖకు ఇవ్వాలని, ముఖ్యంగా జిల్లా కలెక్టర్లు చొరవ తీసుకొని, డిఆర్డిఎ ద్వారా సమభావన సంఘాల మహిళలతో తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు ఎందుకు పంపించుట లేరని చర్చ చేయించాలని కోరుతున్నాను. ఆ చర్చల్లో వచ్చిన సారాంశము ఆధారంగా జిల్లాస్థాయిలో జిల్లా కలెక్టరుగా మీరు తీసుకునే చర్యలు మీరు తీసుకోవాలి. ప్రభుత్వ, మండల పరిషత్ మరియు గిరిజన సంక్షేమ ప్రాథమిక పాఠశాలలను కనీసం 75 నుండి 100 మంది విద్యార్థులుండే విధంగా రీ-ఆర్గనైజ్ చేసి తరగతికొక గది, తరగతికొక టీచర్, ప్రధానోపాధ్యాయుడు,సర్వీసు పర్సన్ యుండే విధంగా ఏర్పాట్లు చేయాలి. ప్రాథమిక పాఠశాలల్లో ప్రీ-ప్రైమరీ తరగతులు ఏర్పాటు చేయాలి. ఈ తరగతుల నిర్వహణకు ఇద్దరు టీచర్లను నియమించాలనారు. 200 పైగా విద్యార్థులున్న ప్రాథమిక పాఠశాలల్లో తరగతికి రెండు సెక్షన్స్, 400 పైగా విద్యార్థులున్న ప్రాథమిక పాఠశాలల్లో తరగతి మూడు సెక్షన్స్ ఏర్పాటు చేయాలి. 10 సెక్షన్స్ పైగా ఉన్న పాఠశాలకు సహాయ ప్రధానోపాధ్యాయ పోస్టును ఇవ్వాలనీ, ప్రాథమిక పాఠశాలల్లో 150 మంది విద్యార్థులకు ఒక సర్వీసు పర్సన్ ఉండే విధంగా నియామకాలు చేయాలనీ, ప్రాథమికోన్నత పాఠశాలల్లో 6, 7 తరగతులలో ఎనోల్మెంటు చాలా తక్కువగా ఉంటుంది. అవసరమైన చోట ఉన్నత పాఠశాలగా అప్గ్రేడ్ చేయాలి. అవసరము లేని చోట ప్రాథమిక పాఠశాలగా డీ-గ్రేడు చేయాలనీ, ఉన్నత పాఠశాలలు: ఉన్నత పాఠశాలల్ని తరగతికి 25 మంది విద్యార్థులుండే విధంగా రీ-ఆర్గనైజ్ చేయాలి. ఉన్నత పాఠశాలల్లో తరగతికొక సెక్షన్ లేదా రెండు సెక్షన్స్ లేదా మూడు సెక్షన్స్ ఉండే విధంగా ఏర్పాటు చేయాలి. ఒక సెక్షన్కు ఏడుగురు సబ్జెక్ట్ టీచర్లు, రెండు సెక్షన్స్కు 14 మంది సబ్జెక్ట్ టీచర్లు, మూడు సెక్షన్స్కు 21 మంది సబ్జెక్ట్ టీచర్లు ఉండాలి. ప్రతి ఐదు సెక్షన్లకు ఒక వ్యాయామ ఉపాధ్యాయుడు, పది సెక్షన్లకు పైగా ఉన్న పాఠశాలలో సహాయ ప్రధాన ఉపాధ్యాయ పోస్టులు మంజూరు చేయాలని కోరారు. ఉన్నత పాఠశాలలన్నింటిలో కంప్యూటర్ లాబ్ ఏర్పాటు చేసి, ప్రత్యేక ఉపాధ్యాయుని నియమించాలి. పాఠశాలల పర్యవేక్షణ వ్యవస్థ ఏర్పాటు చేసి, ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలన్నింటిపై నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలి. మండల విద్యాధికారులు ఉప విద్యాధికారుల పోస్టులు మంజూరు చేసి, భర్తీ చేయాలి. పాఠశాలకు కరెంట్ బిల్ ఇతర అవసరాలకు గ్రాంట్ విడుదల చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించి ఆగిపోయిన బదిలీలు పదోన్నతులు వెంటనే చేపట్టాలి. విడుదల చేసి ఒకటి రెండు తారీకులలో జీతాలు చెల్లించాలి. కేజీవీబీలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, ఔట్సోర్సింగ్ ఉపాధ్యాయులకు మినిమం బేసిక్ పే ఇవ్వాలి. ఐదు రకాల గురుకుల పాఠశాలలో పనిచేసిన ఉపాధ్యాయులకు బదిలీలు పదోన్నతులు చేపట్టాలి. ఈ కార్యక్రమంలో టిఎస్ యుటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి మెతుకు సైదులు, జిల్లా ఉపాధ్యక్షులు సంగు వనిత, కార్యదర్శి కే రాజగోపాల్, మండల అధ్యక్ష కార్యదర్శులు మురళి,సోమ సత్తిరెడ్డి, పట్టణ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి లు పాల్గొన్నారు.