– విద్యార్థి సంఘాల నాయకులు
– మర్రి లక్ష్మణ్ రెడ్డి కళాశాల వద్ద ఆందోళన
నవతెలంగాణ-దుండిగల్
ఇంజినీరింగ్ కళాశాలలో యాజమాన్యం కోటాసీట్ల పేరుతో లక్షల్లో దండుకున్న కళాశాలల వారిపై ప్రభుత్వం చర్యలు చేపట్టి, విద్యార్థులు భవిష్యత్‌కు నష్టం జరుగకుండా చూసే బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలో గల మర్రి లక్ష్మణ్ రెడ్డి క్యాంపస్ 1,(ఎమ్‌ఎల్‌అర్)(ఐఏఅర్‌ఇ )ఏరోనాటికల్ కళాశాలలో మంగళవారం విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కళాశాలలో మేనేజ్మెంట్ కోటా సీట్స్ లేకపోవడం తెలిసి కళాశాల ప్రాంగణంలో ఆందోళన నిర్వహించారు. వారికీ మద్దతుగా ఉస్మానియా యూని వర్సిటీ నాయకులు, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యంగా ఇంజినీరింగ్ కళాశాలలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్ కోసం అప్పులు తీసుకొని సీట్ వస్తుందని డబ్బులు చెల్లించారని.. ఇదే అదనుగా యాజమాన్యం తమ కళాశాలలో మేనేజ్మెంట్ కోటా ఉందని లక్షల్లో వసూలు చేశారని.. కళాశాల యాజమాన్యానికి సీట్ల పెంపకం వీరి చేతిలో లేకపోవడంతో వారి డబ్బులు తిరిగి ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నా.. విద్యార్థులు మరో కళాశాలలోకి వెళ్లేందుకు సమయం లేదన్నారు. విద్యార్థుల భవిష్యత్ గందరగోళం లోపడిందని విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారని నాయకులు తెలిపారు. ఇప్పడికైనా ప్రభుత్వం చోరువ తీసుకొని విద్యార్థులకు నష్టం జరుగకుండా సీట్లు భర్తీ చేసే విధంగా న్యాయం చేయాలని, అదే విధంగా మేనేజ్మెంట్ కోటాతో లక్షల్లో వసూల్‌కు పాల్పడ్డ కళాశాల యాజమాన్యం ఫై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకొవాలని డిమాండ్ చేశారు.