డప్పు, చెప్పు వృత్తిదారులకు ప్రభుత్వం పింఛన్లు మంజూరు చేయాలి

– ఎమ్మార్పీఎస్‌ టీఎస్‌ జిల్లా ఉపాధ్యక్షులు కంద పెద్ద నారసింహ
నవతెలంగాణ-కందుకూరు
డప్పు, చెప్పు వృత్తిదారులకు ప్రభుత్వం పిం ఛన్‌లు మంజూరు చేయాలని ఎమ్మార్పీఎస్‌ టీఎస్‌ జిల్లా ఉపాధ్యక్షులు కందపెద్ద నరసింహ అన్నారు. కం దుకూరు మండల కేంద్రంలో డాక్టర్‌ బీఆర్‌ అం బేద్కర్‌ విగ్రహం ఆవరణలో ఆదివారం ఫిబ్రవరి నెల 29 తేదీన ఇందిరా పార్కులో డప్పు, చెప్పు వృత్తిదారులకు పెన్షన్‌ ఇవ్వాలని ధర్నా నిర్వహిం చారని కరపత్రాలు విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ..వంగపల్లి శీను ఆధ్వర్యంలో పోరు గర్జన బహిరంగ సభకు అధికసంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు మేడి మహేష్‌ మాదిగ, రంగారెడ్డి జిల్లా వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మందరాజు మాదిగ, ఎమ్మార్పీఎస్‌ సీనియర్‌ నాయకులు కొమ్మ గళ్ళ నర సింహ మాదిగ, గడ్డం కష్ణ మాదిగ, చిన్నం జంగ య్య మాదిగ, ముచ్చర్ల నరసింహ మాదిగ, యాదయ్య, సురేష్‌, నాయకులు పాల్గొన్నారు.