నవతెలంగాణ – బెజ్జంకి
విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం విస్మరించడం తగదని ఏఐఎస్ఎఫ్ జిల్లాధ్యక్షుడు సంగెం మధు మండిపడ్డారు.గురుకుల,కేజీబీవీ,ఆశ్రమ వసతి గృహాల్లో మధ్యాహ్న బోజనం వికటించి విద్యార్థులు అస్వస్థతతకు గురవుతున్న సంఘటనలపై ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ తలపెట్టిన పాఠశాలల బంద్ శనివారం మండలంలో పరిపూర్ణమైంది. ఏఐఎస్ఎఫ్ అధ్వర్యంలో పాఠశాలల బంద్ నిర్వహించారు.విద్యార్థుల సమస్యలను పరిష్కరించేల ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహించాలని లేనిపక్షంలో భవిష్యత్తులో విద్యార్థి లోకాన్ని ఏకతాటికి తీసుకువచ్చి ఉద్యమాలు ఉదృతంగా నిర్వహిస్తామని మధు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొన్నారు.