– ప్రధాన రహదారిపై బైఠాయింపు, రాస్తారోకో
నవతెలంగాణ – తంగళ్ళపల్లి
ఆటో నడుపుకుంటూ ఉపాధి పొందుతున్న ఆటో కార్మికులకు ప్రభుత్వం శాశ్వత ఉపాధి కల్పించాలని కరీంనగర్ మాజీ ఎంపీ బోయిన్పల్లి వినోద్ కుమార్ అన్నారు.తంగళ్ళపల్లి మండల కేంద్రంలో ఆటో యూనియన్ అధ్యక్షుడు బండి యోగేందర్ ఆధ్వర్యంలో ఆటో యూనియన్ కార్మికులకు ప్రభుత్వం ఉపాధిని చూపించాలని శుక్రవారం కార్మికులు,ప్రధాన రహదారిపై బైఠాయించి,రాస్తారోకో నిర్వహించారు. కరీంనగర్ మాజీ ఎంపీ బోయిన్పల్లి వినోద్ కుమార్, టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య పాటు పలువురు బి ఆర్ ఎస్ నాయకులు ఆటో యూనియన్ కార్మికులకు మద్దతు పలికారు. నాయకులు మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా ఆటోలు నడుపుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం చేపట్టడం వల్ల ఆటోలకు ఎలాంటి కిరాయిలు లేవన్నారు. దీంతో ఆటోలపై ఆధారపడి జీవిస్తున్న కుటుంబాలు తీవ్రంగా ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే బతుకులు మారుతాయి అని అనుకుంటే రోడ్డున పడ్డ పరిస్థితి నెలకొందన్నారు. ప్రతినెల ఆటోలకు కట్టాల్సిన EMI లు కట్టలేక ఫైనాన్స్ కంపెనీలు ఆటోలను సీజ్ చేస్తున్నారన్నారు.ఇప్పటికైనా ప్రభుత్వం ఆటో డ్రైవర్ లను గుర్తించి ఉపాధి కల్పించాలన్నారు.లేకపోతే ఆటోలను రోడ్లపైనే తగలబెట్టే పరిస్థితి నెలకొంటుందని ఈ సందర్బంగా హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు బొల్లి రామ్మోహన్, గూడూరి ప్రవీణ్,నాయకులు,కార్మికులు పాల్గొన్నారు.