
నవతెలంగాణ- మద్నూర్
డోంగ్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో విధులు నిర్వహించే సెకండ్ ఏఎన్ఎంలు గురువారం నాడు నల్ల బ్రాడ్జీలు ధరించి ప్రభుత్వానికి నిరసన వ్యక్తం చేశారు. ఎన్నో ఏళ్లుగా విధులు నిర్వహిస్తున్న తమకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రెగ్యులరైజేషన్ చేయాలని సెకండ్ ఏఎన్ఎంలు ఈ సందర్భంగా ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. ఈనెల నాలుగో తేదీ నుండి సెకండ్ ఏఎన్ఎంలు సమ్మె బాట పట్టినట్లు వారు పేర్కొన్నారు. ఈ ఆందోళన కార్యక్రమంలో దొంగిలి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని సెకండ్ ఏఎన్ఎంలు పాల్గొన్నారు.