ఊకె వీరాస్వామి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి

సీపీఎం జిల్లా కార్యదర్శి తుమ్మల వెంకటరెడ్డి
నవతెలంగాణ – తాడ్వాయి
మండలంలోని లింగాల గ్రామానికి చెందిన, ఇటీవల గుండెనొప్పి (హార్ట్ స్ట్రోక్) తో అకస్మాత్తుగా మృతి చెందిన ఊకే వీరస్వామి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి తుమ్మల వెంకటరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం మండలంలోని లింగాల బంధాల ఏజెన్సీలో పర్యటించారు. ఇటీవల గుండెపోటుతో మృతి చెందిన వీరస్వామి కుటుంబాన్ని పరామర్శించారు. సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి తుమ్మల వెంకటరెడ్డి మాట్లాడుతూ ఈ మధ్యకాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన పోడు భూమి కి పట్టా ఉన్నది కానీ, అతనికి రైతు బీమా లేదని పేర్కొన్నారు. ఇప్పుడు వచ్చిన నూతన ప్రభుత్వం వీరస్వామి కుటుంబానికి రైతు బీమా వర్తింపజేసి, కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలని అన్నారు. ఖరీఫ్ సీజన్లో వేసిన పంట సరైన దిగుబడి కూడా రాలేదని, మనస్థాపనతో ఉండేవాడని ఆయన తెలిపారు. వీరస్వామి పిల్లలకు ఉన్నత విద్యను అందించి వారి కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగం కల్పించేలా ప్రభుత్వం అన్ని విధాల ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో గొంది రాజేష్, దుగ్గి చిరంజీవి, ఊకె ప్రభాకర్, నాగేశ్వర్రావు తదితరులు పాల్గొన్నారు.