
రాష్ట్రవ్యాప్తంగా ఫోటో గ్రాఫర్ల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోని ఫోటో గ్రాఫర్లకు అండగా రాష్ట్ర ప్రభుత్వం ఉండాలని, ఫోటో అండ్ వీడియో గ్రాఫర్ల అసోసియేషన్ మండలాధ్యక్షుడు చౌడమల్ల సంపత్ ప్రభుత్వాన్ని కోరారు. సోమవారం ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని మండల కేంద్రంలో ఫోటో అండ్ వీడియో గ్రాఫర్ అసోసియేషన్ మండల అధ్యక్షుడు చౌడమల్ల సంపత్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవానికి మండలంలోని అన్ని గ్రామాలకు చెందిన సీనియర్ ఫోటోగ్రాఫర్లు హాజరై కేక్ కట్ చేసి మిఠాయి పంపిణీ చేశారు. అనంతరం సంపత్ మాట్లాడుతూ, ఫోటోలు సజీవ సాక్షాలుగా చిరకాలం నిలిచిపోతాయని, ఫోటో గ్రాపర్లు ఫోటో చిత్రీకరణలో ఎంతో మెలకువలను పాటించి ఫోటోలను చిత్రీకరిస్తారని నేడు ఫోటోగ్రాఫర్ల సమస్యలు అనేకంగా నెలకొన్నాయని,సమస్యల పరిష్కారం కోసం రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి రాష్ట్ర మంత్రివర్గం ప్రత్యేక చొరవ తీసుకొని ఫోటో వీడియో గ్రాఫర్లకు వారి కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీనియర్ ఫోటోగ్రాఫర్ దొనికేలా రాజయ్య, మండల ఫోటోగ్రాఫర్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బోంగోని కుమార్ ,కోశాధికారి పాండ్రాల శ్రీనివాస్, ప్రచార కార్యదర్శి కార్యదర్శి మొలుగూరి రమేష్ ,సలహాదారులు గాజుల స్వామి, గౌరవ అధ్యక్షుడు రాములు ,గోరేమియా, కుమార్, మహేష్, శ్రీనివాస్ ,తదితరులు పాల్గొన్నారు.