
నవతెలంగాణ – ధర్మసాగర్
ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేయాలని, పాలన అనేది నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందని, రాష్ట్రంలో నూతనంగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయంగా ముందుకు సాగాలని స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. బుధవారం మండల అభివృద్ధి కార్యాలయంలో ఎంపీపీ నిమ్మ కవిత రెడ్డి అధ్యక్షతన సర్వసభ్య నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే కడియం శ్రీహరి పదవి బాధ్యతలు చేపట్టి తొలిసారి ముఖ్యఅతిథిగా పాల్గొనడంతో వారికి మండల అధికారులు ప్రజాప్రతినిధులు పుష్పగించాలని ఘనంగా స్వాగతించి సత్కరించారు.ఈ సందర్భంగా మండలంలోని వివిధ శాఖలకు సంబంధించిన ఉన్నతాధికారులు వారి వారి శాఖలలో చేసిన పనులను వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన శాఖలలో ఉన్న లోటుపాట్లను త్వరితగతిన సరి చేసుకోవాలని సూచించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నూతనంగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల కోసమే ప్రజా సంక్షేమం కోసం పాటుపడాలన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో భాగంగా రాష్ట్రంలోని ప్రతి రైతు రెండు లక్షల రుణమాఫీ చెల్లిస్తామని చెప్పి అధికారంలోకి రావడం జరిగిందన్నారు. అధికారంలోకి వచ్చి 45 రోజులు గడుస్తున్న ఇప్పటివరకు రైతులకు రైతుబంధు,రుణమాఫీ అందించిన దాకా లేవన్నారు. మండలంలో దాదాపు 11 హెక్టార్లు 80% వరి నాట్లు రైతులు నాటుకోవడం జరిగిందని, ఈ సందర్భంగా రైతులకు రైతు బంధు, రుణమాఫీ రైతులకు చెల్లిస్తే ఎంతో ఉపయోగపడేది అన్నారు. రాష్ట్రంలో ప్రజా అభీష్టాన్ని స్వాగతిస్తున్నామని ఇది నిరంతరం కొనసాగుతుంది ఉంటుందని గుర్తు చేశారు. వారి అభీష్టం మేరకు ఈ ప్రభుత్వం పాలన కొనసాగించాలన్నారు. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నియోజకవర్గంలోని మండలాలలో గ్రామపంచాయతీలో చేసిన అభివృద్ధి పనులకు కేటాయించిన నిధులను చెల్లించే విధంగా ప్రభుత్వం చొరవ అభివృద్ధి సంక్షేమంలో ఆగి ఉన్న పనుల నిధులను యధావిధిగా కొనసాగించేలా స్పష్టతనివ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈనెల 31 వరకు సర్పంచుల పదవీకాలం ముగియనున్న తరుణంలో గ్రామాలలో వారు చేసిన పనుల బిల్లులను రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి షరతులు లేకుండా బేసరత్తుగా నిధులను చెల్లించాలన్నారు. ఆయా ప్రాంతాలలో మిగిలి ఉన్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు కొత్త టెండర్లను ఆహ్వానించి, అగ్రిమెంట్ చేసుకోవాలని ఉన్నతాధికారులకు సూచించారు. ముఖ్యంగా అధికారులు ప్రజా ఉపయోగకరమైన పనుల విషయాలలో, సర్పంచులు చేసిన పనులకు నిధుల విడుదలలో కాలయాపన చేయకుండా సమస్యలను పరిష్కరించడంలో స్పష్టతనివ్వాలని హెచ్చరించారు. లేదు కావాలని కాలయాపన చేసే అధికారులపై తప్పకుండా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సర్పంచుల ఉద్దేశించి గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన పల్లెభగతి కార్యక్రమంలో గ్రామాలకు సర్పంచులు చేసిన మౌలిక సదుపాయాలు స్మశాన వాటిక, డంపింగ్ యార్డ్లు, కొత్త గ్రామపంచాయతీ నిర్మాణాలు, కమ్యూనిటీ హాళ్లు, ప్రకృతి వనాలు, క్రీడా ప్రాంగణాలను నిర్మించడం గొప్ప వరమాన్ని గుర్తు చేశారు. ప్రతి సర్పంచ్ ప్రస్తుత కాలం ముగుస్తుందనేది కాకుండా ప్రజల మధ్య ఉండే వారికి, ప్రజలే వెతుక్కుంటూ మరి వారికి అవకాశాలు కల్పిస్తారని ఆరోపించారు. అనంతరం మండలంలోని సర్పంచులందరికీ ఆయన శాలువాలతో సత్కరించారు, తదన అనంతరం సర్పంచ్లందరూ గజమాలలతో శాలువాలతో ఎమ్మెల్యేలు సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో జోహార్ రెడ్డి, తాసిల్దార్ సదానందం, జడ్పిటిసి పిట్టల శ్రీలత, జిల్లా కోఆప్షన్ సభ్యురాలు మహమ్మద్ జుబేదా లాల్, వైసీపీ బండారు రవీందర్, మండల కోఆప్షన్ సభ్యులు సుకూర్,ఎంపీఓ కర్ణాకర్ రెడ్డి, మెడికల్ ఆఫీసర్ గోపీనాథ్, వివిధ శాఖల అధికారులు, సర్పంచులు పెసరు రమేష్, ఎర్రబెల్లి శరత్, మామిడి రవీందర్ యాదవ్, ఎంపీటీసీలు బొడ్డు శోభ, వనమాల, వివిధ గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు అధికారులు తదితరులు పాల్గొన్నారు.