పదిలో ప్రభంజనం సృష్టించిన ప్రభుత్వ విద్యార్థులు

నవతెలంగాణ – భిక్కనూర్
భిక్కనూరు మండలం లో ఉన్న జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాల, మహాత్మ జ్యోతిబాపూలే, కస్తూర్బా పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న చదువుతున్న విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించి ప్రభంజనం సృష్టించారు. భిక్కనూర్ జిల్లా పరిషత్ బాలుర పాఠశాలలో 8.8 ప్రమోద్ మార్కులు సాధించగా 96.70% విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. భిక్కనూరు జిల్లా పరిషత్ బాలికల పాఠశాలలో 9.3 వైష్ణవి, భూమిక మార్కులు సాధించగా 81.96% విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. బస్వాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 9.0 సనా మరియన్ 93.93% ఉత్తీర్ణత శాతం, కాచాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 9.0 అంజా గౌడ్ 100% ఉత్తీర్ణత శాతం, తిప్పాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 8.8 శ్రీ హర్షిని 100% ఉత్తీర్ణత శాతం, జంగంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10/10 సనా 91% ఉత్తీర్ణత శాతం, భాగిర్థిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 8.3 రమ్య 82% ఉత్తీర్ణత శాతం,  పెద్ద మల్లారెడ్డి జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో 9.5 ధీరజ్, చంద్రలేఖ, లక్ష్మణ్ 90.70% శాతం, పెద్ద మల్లారెడ్డి జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో 9.5 శ్రావణి 100% ఉత్తీర్ణత శాతం, జంగంపల్లి గ్రామంలో ఉన్న కస్తూర్బా గాంధీ పాఠశాలలో 9.7 హాన్మిక 100% ఉత్తీర్ణత శాతం, జంగంపల్లి గ్రామ శివారులో ఉన్న మహాత్మ జ్యోతిబాపూలే పాఠశాలలో 10/10 మార్కులు 10 మంది విద్యార్థులు మార్కులు సాధించగా 100% ఉత్తీర్ణశాతం సాధించినట్లు ఆయా ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని సంచలన ఫలితాలు సాధించి మండలంలో ప్రభంజనం సృష్టించిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను, ఉపాధ్యాయులను విద్యార్థుల తల్లిదండ్రులు అభినందిస్తూ మండల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.