నవతెలంగాణ చివ్వేంల: అర్హులైన ప్రతి పేద వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతాయని స్పెషల్ ఆఫీసర్ జగదీశ్వర్ రెడ్డి, తహసిల్దార్ రంగారావు, సర్పంచ్ బద్రునాయక్ అన్నారు. శనివారం మండల పరిధిలోని రాజు తండాలో ప్రజా పాలన కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. నూతన ప్రభుత్వం ప్రకటించిన 6 గ్యారెంటీలలో రెండు గ్యారెంటీలను అమలుపరిచారని, మిగతా గ్యారెంటీలకోసం ప్రభుత్వం ప్రజల వద్దకే వచ్చి తమ గ్రామపంచాయతీ ల వద్ద దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందని ప్రతి ఒక్కరు అర్హులైన వారు దరఖాస్తులు చేసుకొని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.. ఈ కార్యక్రమంలో ఏపీవో నాగయ్య,ఉప సర్పంచ్ దశ్రు యూత్ కాంగ్రెస్ నాయకులు పఠాన్ సమీర్, శ్రీనివాస్, వెంకన్న వార్డ్ మెంబర్స్ వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.