ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి గడపకు చేరవేస్తాం..

Government welfare schemes will be delivered to every doorstep.– వికలాంగులు, వితంతువులకు ప్రాధాన్యతే ప్రభుత్వ లక్ష్యం
– డల్ హౌజ్ శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే.
– మహబూబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళి నాయక్ 
నవతెలంగాణ – నెల్లికుదురు
ప్రభుత్వ పథకాలు ప్రతి గడపకు చివర వేసేందుకు ఇందులో భాగంగా ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులోవికలాంగులు,వితంతువులకు,ఇంటి స్థలం ఉన్న పేదవారికి చేరవేసేదే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే డా. భూక్య మురళి నాయక్ అన్నారు.స్థానిక మండల పరిషత్ ఆవరణంలో గురువారం ఇందిరమ్మ ఇల్లు నమోనా ఇంటి నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్థాపన చేసి పైలాన్ ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఒకసారి మాట ఇస్తే తప్పదని.కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి ఉందన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి సంక్షేమ పథకం ప్రతిపల్లె ప్రతి గూడెం గ్రామానికి చేరవేసేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. ఇందిరమ్మ ఇండ్లు నియోజకవర్గానికి సంవత్సరానికి 3500 చొప్పున వస్తాయన్నారు.పార్టీలకతీతంగా కేటాయింపులు జరుగుతాయన్నారు. ప్రభుత్వం మంజూరు చేసే రూ.5లక్షల్లో ఇంటి బేస్మెంట్ నిర్మాణం పూర్తికాగానే రూ.1లక్ష, కోడలు కాగానే రూ.1 లక్ష, స్లాబ్ సమయంలో రూ.2లక్షలు,వర్క్ పూర్తి కాగానే మరో రూ.1 లక్ష చెల్లించనున్నట్లు తెలిపారు.రైతు భరోసా,భూమిలేని నిరుపేదల కోసం రూ.12,000 తదితర పథకాలు ఈనెల 26 నుంచి ప్రారంభమ వుతాయన్నారు. ఇప్పటికే ఎన్నో పథకాలను ప్రవేశపెట్టి ప్రజా ప్రభుత్వంగా ప్రజల హృదయాలలో నిలుస్తోందన్నారు.ఇందిరమ్మ ఇళ్లలో ఎవరైనా ప్రలోభాలకు పాల్పడితే డయల్ యువర్ ఎమ్మెల్యే 83284 73007 ఫోన్ నెంబర్ కు ఫిర్యాదు చేయండని చెప్పారు.కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఏదేళ్ల యాదవ రెడ్డి మాజీ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు నాయిని సత్యపాల్ రెడ్డి డిసిసి ఉపాధ్యక్షుడు బాలాజీ నాయక్ కార్యదర్శి కాసం లక్ష్మారెడ్డి మండల పార్టీ అధ్యక్షుడు గొల్లపల్లి ప్రభాకర్ గౌడ్ మాజీ వైస్ ఎంపీపీ వెంకటేష్ తహసిల్దార్ కోడిచింతల రాజు,ఎంపీడీవో బాలరాజు,హౌసింగ్ డిఇ రాజయ్య, ఎం ఏ ఓ యాస్మిన్,ఎంపీ ఓ పద్మ, ఎపిఎం వరదయ్య,ఏఈ లు బి జగదీష్,ఎస్ కే లాల్ సాహెబ్, తదితరులు పాల్గొన్నారు.