బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర వేములవాడ శాఖను ప్రారంభించిన ప్రభుత్వ విప్ ఆది..

నవతెలంగాణ – వేములవాడ
వేములవాడ పట్టణంలోని రెండవ బైపాస్ రోడ్ లో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర వేములవాడ శాఖను అలాగే, ఏటీఎం మెషీన్ ను ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ రిబ్బన్ కట్ చేసి, జ్యోతిని వెలిగించి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర సేవలను వేములవాడ నియోజకవర్గ ప్రజలు వినియోగించుకోవాలని అన్నారు.  బ్యాంకు వినియోగదారులకు మెరుగైన సేవలు అందించాలని బ్యాంక్ నిర్వాహకులకు సూచించారు. ఈ కార్యక్రమంలో  మున్సిపల్ చైర్ పర్సన్ మాధవి, జోనల్ మేనేజర్ సుషని కుమార్ గుప్తా, బ్యాంకు మేనేజర్ మధుమోహన్ రెడ్డి, కౌన్సిలర్ యాచమనేని శ్రీనివాస్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సాగర వెంకటస్వామి,నాయకులు సంఘ స్వామి యాదవ్, చిలుక రమేష్, కూరగాయల కొమరయ్య, కనికరపు రాకేష్  కాంగ్రెస్ నాయకులు బ్యాంక్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.