ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు అర్థరహితం: ప్రభుత్వ విప్ ఆది

Opposition's allegations are meaningless: Government Whip Adi– రైతులకు మాట ఇచ్చాం.. నెరవేరుస్తాం..
– త్వరలోనే రైతులకు రుణమాఫీ..
– రేషన్ కార్డు ఉంటేనే రైతులకు రుణమాఫీ అనేది పచ్చి అబద్ధం..
నవతెలంగాణ – వేములవాడ
ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు అర్థరహితం..రైతులకు మాట ఇచ్చాం నెరవేరుస్తాం..త్వరలోనే రైతులకు రుణమాఫీ..రేషన్ కార్డు ఉంటేనే రైతులకు రుణమాఫీ అనేది పచ్చి అబద్ధం అని ప్రభుత్వ విప్ ,వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ ప్రెస్ నోట్ ద్వారా తెలిపారు. రుణ మాఫీకి రైతు కుటుంబాన్ని ప్రభుత్వం ఒక యూనిట్గా పరిగణిస్తుంది,అర్హులైన రైతు కుటుంబాలందరికీ రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామన్నారు. ఈ విషయంలో అనుమానాలు,అపోహలకు తావు లేదు,గతంతో పోలిస్తే కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం అదనపు నిబంధనలేమీ విధించలేదు లేదన్నారు. ఒక్కో రైతు కుటుంబం యూనిట్గా రుణమాఫీ వర్తిస్తున్నందున, ఆ కుటుంబాన్ని నిర్ధారించేందుకు మాత్రమే రేషన్ కార్డుల డేటాబేస్ ను ప్రభుత్వం వినియోగిస్తుంది. గతంలో 2014, 2018లో లక్ష రూపాయల రుణ మాఫీకి బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన నిబంధనలనే కొత్త ప్రభుత్వం కూడా పాటించింది అన్నారు.గత ప్రభుత్వం మభ్యపెట్టినట్లుగా దాచిపెట్టినట్లుగా కాకుండా,అందరికీ అర్థమయ్యేలా రుణమాఫీ విధి విధానాల ఉత్తర్వులను జారీ చేసింది అని వెల్లడించారు.గత ప్రభుత్వం 2020 మార్చి 17న జారీ చేసిన రైతుల రుణ మాఫీ జీవోలోనూ ఇదే విషయాన్ని ప్రస్తావించింది, అప్పటి జీవో నెం. 148లోని సెక్షన్ (బి) ఆరో నిబంధనలో అందుబాటులో ఉన్న డేటా బేస్ ఆధారంగా రైతుల కుటుంబాన్ని నిర్ధారించటంతో పాటు, ఒకటికి మించి లోన్లు తీసుకున్న వారిని గుర్తించి బ్యాంకులు ఇచ్చిన జాబితా తుది పరిశీలన జరుగుతుంది అని స్పష్టంగా ప్రస్తావించింది అన్నారు. కుటుంబాలను నిర్ధారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర అప్పుడైనా ఇప్పుడైనా రేషన్ కార్డుల డేటాబేస్ తప్ప మరొకటి అందుబాటులో లేదు,ఆ విషయాన్ని గత ప్రభుత్వం దాచిపెట్టి ప్రజలను మభ్యపెట్టింది.
కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఆ విషయాన్ని కూడా ప్రజలకు తెలియజేసేలా పారదర్శకతను పాటించింది అని తెలిపారు. అంత మాత్రాన రేషన్ కార్డుంటేనే రైతులకు రుణ మాఫీ వర్తిస్తుందని జరుగుతున్న ప్రచారం సరైనది కాదు రుణమాఫీకి రైతుకుటుంబం యూనిట్ గా పరిగణిస్తున్నందున ఆ కుటుంబాన్ని నిర్ణయించడానికి మాత్రమే రేషన్ కార్డు ప్రామాణికంగా ఉంటుందని రైతులందరూ  గుర్తించాలని అన్నారు.రాష్ట్రంలో ప్రస్తుతం 89.96 లక్షల రేషన్ కార్డులున్నాయి. ఈసారి రుణమాఫీ పథకం దాదాపు 30 లక్షల మంది రైతులకు వర్తిస్తుందని వ్యవసాయ శాఖ ఇప్పటికే బ్యాంకులు ఇచ్చిన డేటా ఆధారంగా అంచనా వేసింది అని అన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం దేశమందరి దృష్టిని ఆకర్షించేలా భారీ మొత్తం ఈ పథకానికి రూ.31 వేల కోట్ల నిధులు కేటాయించింది దీంతో రాష్ట్రంలో దాదాపు 30 లక్షల రైతు కుటుంబాలు రుణ విముక్తి  పొందుతాయని తెలిపారు. రేషన్ కార్డు లేని అర్హులైన రైతు కుటుంబాలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అలాంటి రైతులెవరైనా ఉంటే.. వ్యవసాయ శాఖ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఆన్లైన్ పోర్టల్ ద్వారా లేదా మండల స్థాయిలో ఏర్పాటు చేసే హెల్ప్ లైన్ సెంటర్లలో ఫిర్యాదు  చేయాలని అన్నారు. 30 రోజుల్లో అధికారులు ఫీల్డ్ వెరిఫికేషన్ చేసి అర్హులైతే రుణమాఫీ అందిస్తారు. రుణమాఫీపై సమగ్రమైన ఫిర్యాదుల పరిష్కార విభాగాన్ని వ్యవసాయ శాఖ ఏర్పాటు చేస్తుంది. దీని ద్వారా తమ రికార్డులలో పొరపాట్లు ఉంటే రైతులు వాటిని సరిదిద్దుకునే అవకాశం  ఉంటుందని అన్నారు. జిల్లా కలెక్టర్లు, జిల్లా స్థాయి, డివిజన్, మండల వ్యవసాయాధికారులు ఫిర్యాదుల పరిష్కారంలో చురుకుగా పాల్గొనాలని ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. ఈ ప్రభుత్వం ప్రతి ఒక్కరి ఫిర్యాదును పరిష్కరించేందుకు సిద్ధంగా ఉంది ఉంది అని వెల్లడించారు.గత ప్రభుత్వం కటాఫ్ తీసుకున్న 12 డిసెంబర్ 2018 నుండి తీసుకున్న పంట రుణాలన్నింటినీ ప్రభుత్వం ఈసారి రైతు రుణమాఫీ పథకం పరిధిలోకి తెచ్చింది. అంతకు ముందు తీసుకున్న రుణాలకు కూడా వర్తింపజేయాలని ప్రతిపక్షాలు చేస్తున్న డిమాండ్లు అర్ధరహితమైనవి అని అన్నారు. పీఎం కిసాన్ పథకం నిబంధనలతో రాష్ట్రంలోని రైతుల్లో ఎక్కువ మంది రుణమాఫీ అర్హత కోల్పోతారనే ప్రచారంలోనూ వీసమెత్తు నిజం లేదు. నిజానికి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పిఎం కిసాన్) పధకం వ్యవసాయమే ఆధారంగా జీవించే అర్హులైనరైతులకు వర్తిస్తుంది అని తెలిపారు.
కేవలం మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మేయర్లు, జడ్పీ చైర్మన్లు,రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్నవారు, కేంద్ర రాష్ట్ర ఉద్యోగులు, రూ. 10 వేలకు మించి పెన్షన్ అందుకునే రిటైర్డ్ ఉద్యోగులు, అధిక ఆదాయం ఉండి ఐటి పన్ను కట్టేవారు మాత్రమే పీఎం కిసాన్ పథకం నుంచి కేంద్ర ప్రభుత్వం మినహాయించింది.
పీఎం కిసాన్ మినహాయింపులను రాష్ట్ర ప్రభుత్వం వద్ద డేటా లభ్యంగా ఉన్నంత వరకు ఆచరణాత్మకంగా అమలు చేస్తుందని తాజా రుణమాఫీ పథకం నిబంధనల్లో ఉంది.వాస్తవానికి ఇప్పటివరకు ప్రభుత్వం వద్ద ప్రభుత్వ ఉద్యోగుల డేటా తప్ప మిగతావేవీ అందుబాటులో లేవు. దీంతో సీఎం కిసాన్ నిబంధనలతో అర్హులైన రైతులెవరూ ఈ రుణమాఫీకి దూరం అయ్యే పరిస్థితి లేనే లేదు అన్నారు. గతంలో పదేండ్లు రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులను రుణమాఫీ పేరుతో మోసం చేసింది. పదేండ్లలో రెండుసార్లు కలిపినా కేవలం రూ. 28 వేల కోట్లు రుణమాఫీ చేసింది. 2014లో రూ.16 వేల కోట్లు మాఫీ చేసింది. 2018లో దాదాపు రూ.12 వేల కోట్లు మాఫీ చేసింది,2014 నుంచి 2018 వరకు విడతల వారీగా నాలుగేండ్లు రైతుల ఓట్లు గుర్తుకు వచ్చినప్పుడు దఫదఫాలుగా రుణమాఫీ నిధులు ఖాతాల్లో వేసింది.దీంతో రైతులపై వడ్డీ భారంతో పాటు కొత్త రుణాలు తీసుకోలేక ఇబ్బందులు పడ్డారు.2018లో రెండోసారి లక్ష రూపాయల రుణమాఫీ ఇచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం 2023 ఎన్నికల ఏడాది వచ్చేంతవరకు రుణమాఫీ చేయకుండా మోసం చేసింది. చివరకు రూ.8579 కోట్లు రైతులకు చెల్లించకుండా ఎగ్గొట్టింది. దాదాపు 12 లక్షల మంది రైతులను మోసం చేసిందిఅని ఆవేదన వ్యక్తం చేశారు.