
– కాంగ్రెస్ పార్టీ లోకి ఆహ్వానించిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్..
నవతెలంగాణ – వేములవాడ
రాబోవు పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీనీ ఆదరించాలనీ ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. బుదవారం వేములవాడ పట్టణంలోనీ ఆది శ్రీనివాస్ నివాసంలో కోనరావుపేట మండలం కొండాపూర్ వెంకట్రావుపేట ఎంపీటీసీ పల్లె మంజుల – రవీందర్ రెడ్డి, వెంకట్రావుపేట బీఆర్ఎస్ మాజీ గ్రామ శాఖ అధ్యక్షులు చెరుకుపల్లి నరసింహారెడ్డి, మాజీ వార్డు సభ్యులు చెరుకుపల్లి సుజాత- భీమ్ రెడ్డి లు ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.వారికి ప్రభుత్వ విప్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ప్రభుత్వ విప్ మాట్లాడుతూ నేడు కాంగ్రెస్ పార్టీలో చేరిన పల్లె మంజుల రవీందర్ రెడ్డి లను సాధారణంగా పార్టీలోకి ఆహ్వానిస్తున్నామన్నారు. నేటి నుంచి వారు కాంగ్రెస్ పార్టీ కుటుంబంలో సభ్యులుగా ఉంటారన్నారు. కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలు ఆదరిస్తున్నారని అన్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ సామాజిక వర్గాల్లో ఉన్నటువంటి 16 కులాలకు కార్పొరేషన్ ఏర్పాటు చేసి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఒక చారిత్రాత్మకమైన నిర్ణయాన్ని తీసుకుందన్నారు. వెనుకబడిన కులాల అభ్యున్నతి కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేసినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఇతర మంత్రివర్గ సభ్యులకు మంగళవారం రోజున స్వయాన కలిసి ఒక బలహీన వర్గాల బిడ్డగా ఒక బీసీ బిడ్డగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయాడం జరిగిందన్నారు.గత పది సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో ఒక్క కులాన్ని కూడా పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. కేవలం కాలేశ్వరం ప్రాజెక్టును కామదేనువుగా మార్చుకొని దోచుకోవడానికి ప్రయత్నించారు అని అన్నారు. కుంగిన కాలేశ్వరం గురించి కెసిఆర్ ఒక్క మాట కూడ మాట్లాడకపోవడాన్ని ప్రజలు గమనిచాలని కోరారు.మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఆరోగ్య శ్రీ పరిమితి 10 లక్షలు,500 కే సిలిండర్, గృహా జ్యోతి కింద 200 వరకు ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇండ్లు ఇలాంటి పేద ప్రజలకు ఉపయోగపడే సంక్షేమ కార్యక్రమాలని చూసి ఓర్వలేకే, అధికారం కోల్పోయిన బాధలో బీఆర్ఎస్ నాయకులు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్న తీరును ప్రజలు గమనించాలనీ రాబోపు పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని కోరారు. మతాన్ని, సిబిఐ, ఈడి నీ నమ్ముకొని వస్తున్న, బిజేపి పార్టీ ఒకవైపు ఉంటే, మరోవైపు టిఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చుకొని తెలంగాణ పదాన్ని పక్కన పెట్టి తెలంగాణ ప్రజల నుండి పేగుబంధాన్ని తెంపుకున్న బీఆర్ఎస్ ను పక్కన పెట్టాలన్నారు.రాబోవు పార్లమెంట్ ఎన్నికల్లో పేద, బడుగు, బలహీన వర్గాలకు, రైతు వర్గాలకు మేలు చేస్తున్నా కాంగ్రెస్ పార్టీనీ ఆదరించాలని ప్రజలకు, యువకులకు, మేధావులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు షేక్ ఫిరోజ్ పాషా,జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి,మాజీ సర్పంచ్ జిల్లా కార్యదర్శి నాలుక సత్యం,యూత్ అధ్యక్షులు నాలుక వేణు ,శ్రీకాంత్ ,మల్లయ్య తదితరులు ఉన్నారు.