వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి సన్నిధానంలో ముక్కోటి ఏకాదశి పర్వదినాన భారీ ఫ్యాను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా శుక్రవారం ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఈవో వినోద్ రెడ్డితో కలిసి భారీ ఫ్యాన్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆలయంలో ఈ భారీ ఫ్యాన్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని తెలిపారు. భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేయడంపై భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.