వన మహోత్సవం మహా ఉద్యమలా సాగాలి: ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

Vana Mahotsavam should be a great movement: Government Whip Adi Srinivas– నిస్సహాయకులకు సహాయం అందిచడమే ప్రభుత్వ లక్ష్యం..
– వన్ టైం సెటిల్మెంట్ కింద రైతలకు రుణమాఫీ చేసాం..
– ముంపు గ్రామాల సమస్యలను పరిష్కరించుకుందాం..
నవతెలంగాణ – వేములవాడ 
వన మహోత్సవం మహా ఉద్యమంలో సాగాలి.. నిస్సహాయకులకు సహాయం అందిచడమే ప్రభుత్వ లక్ష్యం అని ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ అన్నారు. సోమవారం తెలంగాణ ప్రభుత్వం అటవి శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా వేములవాడ అర్బన్ మండలం మారుపాక,అనుపురం,రుద్రావరం గ్రామంల్లో ప్రభుత్వ విప్,వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ..వన మహోత్సవం మహా ఉద్యమంల సాగాలి..ప్రతి పౌరుడు, ప్రతిఒక మహిళ ఒక మొక్క నాటి ఆకుపచ్చ తెలంగాణ ఆవిష్కరణలో తన వంతు పాత్ర  పోషించాలని వెల్లడించారు.మనం చెట్ల యొక్క ప్రాముఖ్యతను పాఠ్యపుస్తకాల్లో చదువుకున్నాం, బాధ్యతగా చెట్లను రక్షించుకోవాలని గ్రామస్తులకు సూచించారు.ఇప్పుడు ఉన్నా పరిస్థితుల్లో అంతరించిపోతున్న అడవులను కాపాడే బాధ్యత ప్రతీ ఒక్కరి పై ఉంది చెట్లను పెంచడం వలన  స్వచ్ఛమైన గాలి లభిస్తుంది అని అన్నారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న వనమహోత్సవం కార్యక్రమంలో ప్రతి ఒక్కరు భాగ్యస్వామ్యం కావాలి అని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం అటవీ సంపదను కాపాడుకోవడానికి చర్యలు తీసుకుంటుంది,చెట్లను పెంచడం వలన అవి కార్బన్ డై ఆక్సిడ్ తీసుకుని స్వచ్ఛమైన గాలిని ఇస్తుంది అని అన్నారు. స్వచ్ఛమైన గాలిని పీల్చడం వలన అనారోగ్యం బారిన పడకుండా ఆరోగ్యంగా ఉండాలంటే చెట్లు సంరక్షించుకోవాలని తెలిపారు.
గ్రామాల్లో  చెట్లను  నరికి వేయకుండా అటవీ సంపాదన కాపాడాల్సిన బాధ్యత మనందరిపై ఉంది అని తెలిపారు.ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా చెట్లను పెంచడం కార్యక్రమం చేపట్టాలిఅని వెల్లడించారు.కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సంక్షేమ పథకాల అమలు చేస్తూనే  అభివృద్ధి పనులు చేపడుతున్నాం అన్నారు.సర్వ మానవాళికి అవసరమైన ఆక్సిజన్ అత్యవసర మైన సందర్భంలో ఆక్సిజన్ ఉత్పత్తి చేసే చెట్లను నరికి వేయడం వల్ల కృత్రిమంగా ఆక్సిజన్ వైపు ప్రయాణం చేస్తున్న సందర్భంగా చూస్తున్నాం అని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు అభివృద్ధి ఒకవైపు సంక్షేమ మరోవైపు రెండు కళ్ళల పనిచేస్తుంది అని అన్నారు. ఇప్పటికే ఆరు గ్యారంటీలో ఐదు గ్యారంటీలను అమలు చేస్తున్నాం..మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కల్పించాం ఇప్పటివరకు 62  కోట్ల ఆర్టీసీ ప్రయాణాలు జరిగాయి దీని ద్వారా 2000 కోట్లు ఆర్టీసీకి చెల్లించం. ఉచిత కరెంటు అందజేస్తున్నాం, ఆరోగ్యశ్రీ పరిమితి 10 లక్షలకు పెంచడం జరిగింది అని తెలిపారు.రైతులకు దేశ చరిత్రలోనే ఒక సాహసోపేతం నిర్ణయంగా రైతు రుణమాఫీ చేశాం,రైతులకు వన్ టైం సెటిల్మెంట్ కింద రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదని అన్నారు.గతంలో వైయస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు యూపీఐ చైర్ పర్సన్ గా సోనియాగాంధీ ఉన్నప్పుడు వన్ టైమ్ సెటిల్మెంట్ అయ్యాయి, ఆనాడు ధనిక రాష్టంగా ఉన్న కాని కేసీఆర్ గత పది సంవత్సరాల్లో పావల పావలా ఇస్తే అది రైతు మిత్తికి పోయింది తప్ప అసలు మాఫీ కాలేదు అసహనం వ్యక్తం చేశారు.మొన్నటి రోజున రూపాయి నుంచి లక్ష రూపాయలు లోపు రుణమాఫీ చేయడం జరిగింది, ఈ నెలాఖరులోగా లక్ష నుంచి 1,50,000 లోపు రుణమాఫీ చేయడం జరుగుతుంది, తదుపరి ఆగస్టులో రూ.1,50,000 నుంచి 2 లక్షల్లో రుణమాఫీ చేయడం జరుగుతుందని అన్నారు.
అక్కడక్కడ కొంతమంది రైతులను తప్పుదారి పట్టే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారుఏ రైతు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు మేము చెప్పిన తేదీల ప్రకారం మాఫీ చేస్తామని ఆయన తెలిపారు.రేషన్ కార్డు అనేది కేవలం కుటుంబం గుర్తింపును ప్రామాణికం.. రైతై ఉండి పాసుబుక్ ఉంది బ్యాంకు రుణం ఉంటే వారు అర్హులు.. అర్హులై ఉండి సాంకేతిక కారణాల వల్ల రుణం మాఫీ కాకపోతే సంబంధిత అధికారులను సంప్రదించాలి అని అన్నారు. రైతు భరోసాను కూడా ఇస్తాం..రూ.2000 పెన్షన్ రూ.4000 చేస్తాం.. ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ తప్పకుండా నెరవేరుస్తాం..కేటీఆర్ ఎక్కడో మాట్లాడుతూ ఊరించి ఊరించి రుణమాఫీ చేస్తున్నారని ఆన్నారు.మీరు గత పది సంవత్సరాలుగా ఊరించి ఊరించి పావల పావలా చేస్తే మేము వన్ టైం సెటిల్మెంట్  రుణమాఫీ చేస్తున్నామని అన్నారు. లక్ష లక్ష అని రెండుసార్లు ఇచ్చింది కేవలం రూ.21 వేల కోట్లు. 12 లక్షల మంది రైతులకు ఎనిమిది వేల కోట్ల రుణాలు ఎగ్గొట్టారు.. ఇది అధికారికంగా లెక్కల్లో ఉంది.. కానీ నేడు 31 వేల కోట్లతో 30 లక్షల పై చీల కుటుంబాలకు రుణమాఫీ  చేస్తున్నామని అన్నారు. ఇంత మంచి కార్యక్రమాన్ని అభినందించాల్సింది పోయి సన్నాయి నొక్కులు నొక్కుతున్న వారిని ప్రజలు తప్పకుండా రానున్న రోజుల్లో బుద్ధి చెప్తారు.
ముంపు గ్రామాల సమస్యలను త్వరలో పరిష్కరించుకుందాం..
గతంలో ముంపు గ్రామాల సమస్యల కోసం అనేక పోరాటాలు చేసాం,మీ సేవకుడిగా ఉంటూ మీకు ఇచ్చిన మాట ప్రకారం ప్రతి హామీని నెరవేరుస్తా.. రాబోవు రోజుల్లో ప్రజా సమస్యల పరిష్కారమే పరమవదిగా  పని చేస్తానని ముప్పు గ్రామాల నిర్వాసితులకు గ్రామస్తులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అర్బన్ మండల అధ్యక్షులు పిల్లి కనకయ్య, సీనియర్ నాయకులు ఎర్రం రాజు, ప్రభాకర్ రెడ్డి, ఊరడి రాంరెడ్డి, పోరెడ్డి రవి, స్థానిక కాంగ్రెస్ నాయకులు గ్రామస్తులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.