ముఖ్యమంత్రి పర్యటన విజయవంతం చేయాలి: ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

నవతెలంగాణ – వేములవాడ
ముఖ్యమంత్రి పర్యటన విజయవంతం చేయాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో మంగళవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ నెల 7వ తేదీ గురువారం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొట్టమొదటి సారిగా ముఖ్యమంత్రి హోదాలో రాజన్న సిరిసిల్లకు వస్తున్నారని ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలనీ కోరారు. 7 తేదీ గురువారం సాయంత్రం 4 గంటలకు హెలికాప్టర్ ద్వారా సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చేరుకొని, జిల్లా ఎస్పీ కార్యాలయాన్ని ప్రారంభించి, జిల్లా కేంద్రంలో మిగతా అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారని వెల్లడించారు. సేఫ్టీ మోకు కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని తెలిపారు.. ముఖ్యమంత్రి హోదాలో శ్రీ రాజరాజేశ్వర స్వామి వారికీ పట్టు వస్త్రాలు సమర్పించి, స్వామి వారిని దర్శనం చేసుకుంటారని తెలిపారు. అనంతరం బాలానగర్ లో జరిగే బహిరంగ సభ పాల్గొంటారని అన్నారు.  వీటిడిఏ సమావేశం ద్వారా గతంలో ఆగిపోయిన నిధులను తిరిగి తీసుకొచ్చామని అన్నారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి పర్యటన మన జిల్లాతో పాటు, నియోజకవర్గం అభివృద్ధికి ఎంతో దోహదపడుతుందన్నారు. ప్రజలు పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొని ముఖ్యమంత్రి బహిరంగ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సాగారం వెంకటస్వామి, కనికరపు రాకేష్, పాత సత్యలక్ష్మి, వస్తాది కృష్ణ ప్రసాద్ గౌడ్, లింగంపల్లి కిరణ్ తో పాటు తదితరులు పాల్గొన్నారు.