హైదరాబాద్ లోని జూబ్లిహిల్స్ లోని ముఖ్యమంత్రి స్వగృహంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ నెల 8వతేదీన యాదగిరిగుట్ట పర్యటన నేపథ్యంలో పలు విషయాలను చర్చించారు. ఈ సందర్భంగా ఆలేరు నియోజకవర్గనికి సంబంధించిన పలు అభివృద్ధి పనులు, పలు సమస్యలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకొని వెళ్లగా ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఈరసరపు యాదగిరి గౌడ్ పాల్గొన్నారు.