మల్లన్నస్వామిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య

నవతెలంగాణ – తుర్కపల్లి
తుర్కపల్లి మండలం రుస్తాపూర్ గ్రామంలో శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారి బ్రహ్మోత్సవాలలో భాగంగా ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే  బీర్ల ఐలయ్య ముఖ్యఅతిథిగా పాల్గొన్నరు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ శ్రేణులు,ప్రజలు పెద్దఎతున్న ఘన స్వాగతం పలికారు. భారీ క్రేన్ సహాయం తో గజమాల వేసి సన్మానించారు. అనంతరం మల్లికార్జున స్వామిని దర్శనం చేసుకున్నారు.ఆ తర్వాత రేణుక ఎల్లమ్మ తల్లిని దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా పార్టీ నాయకులు ప్రజలు బీర్ల ఐలయ్య ను ఘనంగా సన్మానించారు.
ప్రమాదకరమైన మూలమలుపును పరిశీలించినప్రభుత్వవిప్ : తుర్కపల్లి మండలం ముల్కలపల్లి-సంగ్య తండా మధ్య ఉన్న ప్రమాదకరమైన కెనాల్ మూలమలుపు ను ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే  బీర్ల ఐలయ్య పరిశీలించారు. సంబంధింత అధికారులకు ఫోన్ చేసి సమస్య వెంటనే పరిష్కరించాలని తెలిపారు.నేషనల్ హైవే ఈఈ,ఆర్ అండ్ బీ ఈఈ, ట్రాఫిక్ ఏసీపీ తో మాట్లాడి భారీ గేట్స్,స్పీడ్ బ్రేకర్స్ వేసి ప్రమాదం జరగకుండా చూడాలన్నారు.యువకుడి మృతి పట్ల ప్రగాఢ సానుభూతి తెలిపారు.ఇలాంటి ప్రమాదలు జరగకుండా చర్యలు చేపట్టాలని తెలిపారు.