మంత్రిని కలిసిన ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య

Government Whip Beerla Ailaiah who met the Ministerనవతెలంగాణ – యాదగిరిగుట్ట రూరల్
తెలంగాణ రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ని, మునుగోడు ఎమ్మెల్యే  రాజగోపాల్ రెడ్డిని  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే  బీర్ల ఐలయ్య మర్యాదపూర్వకంగా కలసి దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మి నరసింహస్వామి వారి ప్రసాదం అందజేశారు. ఆలేరు నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులపై చర్చించారు.