ఆలేరు నియోజకవర్గ ప్రజలకు రుణపడి ఉంటా: ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య 

– తెలంగాణ అసెంబ్లీలో ప్రభుత్వ విప్ ఛాంబర్ ని ప్రారంభించిన  మోత్కుపల్లి నర్సింహులు, బీర్ల ఐలయ్య 
– ముఖ్య అతిథులుగా పాల్గొన్న స్పీకర్ గడ్డం ప్రసాద్
– రెండు పార్లమెంట్ స్థానాలలో అత్యధిక మెజారిటీతో కాంగ్రెస్ గెలుపు ఖాయం
నవతెలంగాణ – యాదగిరిగుట్ట రూరల్ 
అత్యదిక మెజారిటీ తో గెలిపించిన ఆలేరు నియోజకవర్గ ప్రజలకు రుణపడి ఉంటాననీ ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అన్నారు. గురువారం, తెలంగాణ అసెంబ్లీలో  ప్రభుత్వ విప్ ఛాంబర్, కార్యాలయాన్ని మోత్కుపల్లి నర్సింహులు, బీర్ల ఐలయ్య ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా స్పీకర్ గడ్డం ప్రసాద్ హాజరయ్యారు. యాదాద్రి ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి, ఛాంబర్ లోకి ప్రవేశించారు. అనంతరం అర్చకులు బీర్ల ఐలయ్యకి వేద ఆశీర్వచనం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రజలు మార్పు కోరుకున్నారు. ప్రజాపాలనను తెలంగాణ ప్రజలు దివించారు. ఆలేరు ప్రజలకు సేవ చేసుకుని రుణం తీర్చుకుంటా అన్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం అహర్నిశలు పనిచేస్తానని అన్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోనీ రెండు పార్లమెంటు నియోజకవర్గాలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను శక్తి వంచన లేకుండా పనిచేసి, అత్యధిక మెజారిటీతో గెలిపించుకొని తీరతామని తెలిపారు.  తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కి, ఆర్ అండ్ బీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి, స్పీకర్ గడ్డం ప్రసాద్ కి తనను గుర్తించి ప్రభుత్వ విప్ గా నియమించినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఈ ఛాంబర్ ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ ఛాంబర్ ద్వారా ఆలేరు నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండి ఆలేరు నియోజకవర్గ అభివృద్ధికి కృషిచేస్తాను. ప్రభుత్వం అందజేస్తున్న ఫలాలను ప్రతి లబ్ధిదారునికి అందించేందుకు కృషి చేస్తానని బీర్ల ఐలయ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు సంజీవరెడ్డి, యాదగిరి గౌడ్, యాదగిరిగుట్ట ఎంపీపీ చీర శ్రీశైలం, మండల పార్టీ అధ్యక్షులు కానుగు బాలరాజు గౌడ్,  బీర్ల శంకర్, దుంబాల వెంకట్ రెడ్డి,  ముక్కర్ల మల్లేష్ యాదవ్, భరత్ గౌడ్, సుబ్బురు ప్రశాంత్, ఉపేందర్ గౌడ్ మండల, గ్రామస్థాయి నాయకులు కార్యకర్తలు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.