వేములవాడ నియోజకవర్గం రుద్రంగి మండల కేంద్రంలో నిర్వహించిన ప్రజా పాలన కార్యక్రమంలో భాగంగా ఆరు గ్యారెంటీ ల దరఖాస్తులు స్వీకరణ కార్యక్రమానికి నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.అధికారిక కార్యక్రమానికి మొట్టమొదటి సారి పాల్గొన్నా ఆయనకు గ్రామ ప్రజలు అధికారులు ఘనస్వాగతం పలికారు.ఈ సందర్భంగా ఆయన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ తర్రె ప్రభలత మనోహర్,ఎంపీపీ గంగం స్వరూప మహేష్,జడ్పీటిసి గట్ల మినయ్య,సెస్ డైరెక్టర్ ఆకుల గంగారాం, ఎంపీటీసీ మంచే లావణ్య రాజేశం,ఉప సర్పంచ్ బైరి గంగమల్లయ్య, ఎంపీడీఓ శంకర్, తహసీల్దార్ శ్రీ లత, ఎంపిఓ సుధాకర్,వార్డ్ సభ్యులు చెప్యాల గణేష్, గండి నారాయణ, సూరా యాదయ్య, సతీష్, కార్యదర్శులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.