సీఎం, మంత్రి ని కలిసిన ప్రభుత్వ విప్..

నవతెలంగాణ – వేములవాడ
విదేశీ పర్యటన ముగించుకొని వచ్చిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,  ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబును వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ బుధవారం వారిని కలిసి సత్కరించి, ఫ్లవర్ బొకే అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఆర్థికాభివృద్ధి,యువతకు ఉద్యోగ ఉపాధి కల్పనకు దోహదపడే పెట్టుబడులే లక్ష్యంగా అమెరికా, దక్షిణ కొరియా దేశాల్లో పర్యటనను దిగ్విజయంగా ముగించుకుని రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడం, యువతకు ఉపాధి కల్పన మార్గంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుందని ఆయ అన్నారు.   సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రభుత్వ విప్,వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగిందని తెలిపారు.