
మండలంలోని మల్లుపల్లి, భిక్కనూర్ పట్టణ కేంద్రంలో పలు అభివృద్ధి పనులను ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గంప గోవర్ధన్ ప్రారంభించారు. మల్లుపల్లి గ్రామంలో నూతన గ్రామపంచాయతీ భవనం, రెడ్డి సంఘ భవనం, గ్రామంలో పలు అభివృద్ధి పనులు ప్రారంభించారు. అలాగే భిక్కనూర్ పట్టణ కేంద్రంలో ప్రభుత్వ ఆసుపత్రిలో చేపట్టిన అభివృద్ధి పనులు, ఫీజ్ ఆఫ్ కాల్ నూతన భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి అధిక నిధులు కేటాయిస్తూ, ప్రజా సంక్షేమం కోసం నూతన పథకాలను ప్రవేశపెడుతుందని, అన్ని వర్గాల వారిని ఆదుకుంటూ దేశంలోనే తెలంగాణ రాష్ట్రం దిక్సూచిగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గాల్ రెడ్డి, జడ్పిటిసి పద్మా నాగభూషణం గౌడ్, బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు నరసింహారెడ్డి, మల్లుపల్లి సర్పంచ్ లలితా శంకర్, భిక్నూర్ సర్పంచ్ తునికి వేణు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ హనుమంత్ రెడ్డి, ఆయా గ్రామాల సర్పంచులు, సొసైటీ చైర్మన్లు, ఎంపీటీసీలు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.