పలు అభివృద్ధి పనులు ప్రారంభించిన ప్రభుత్వ విప్..

నవతెలంగాణ-భిక్కనూర్
మండలంలోని అయ్యవారిపల్లి గ్రామంలో పలు అభివృద్ధి పనులను ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గంప గోవర్ధన్ మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామంలో ఒక కోటి రూపాయలతో చేపట్టిన అభివృద్ధి పనులను ప్రారంభించి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి అధిక నిధులు కేటాయిస్తుందని, అన్ని వర్గాల ప్రజలకు ఆదుకుంటుందని సూచించారు. అలాగే కాచాపూర్, పెద్ద మల్లారెడ్డి గ్రామాల మధ్య నూతనంగా 2 కోట్ల రూపాయలతో నిర్మించిన బ్రిడ్జిని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గాల్ రెడ్డి, జడ్పిటిసి పద్మా నాగభూషణం గౌడ్, బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు నరసింహారెడ్డి, వైస్ ఎంపీపీ యాదగిరి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ హనుమంత్ రెడ్డి, ఆలయ పునర్ నిర్మాణ కమిటీ చైర్మన్ మహేందర్ రెడ్డి, సర్పంచులు సులోచన సుదర్శన్, లక్ష్మీ రాజలింగం, లక్ష్మి, డిసిసిబి డైరెక్టర్ కిష్టా గౌడ్, సొసైటీ చైర్మన్ లు రాజా గౌడ్, భూమ్ రెడ్డి, ఎంపీటీసీ సాయ గౌడ్, నాయకులు రామచంద్రం, సతీష్ రెడ్డి, బసవయ్య, కార్యకర్తలు, ఆయా శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.