– మహబూబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్
నవతెలంగాణ-నెల్లికుదురు : రైతుల భూ సమస్యల పరిష్కారమే ప్రభుత్వ లక్ష్యమని మహబూబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళి నాయక్ అన్నారు మండలంలోని ఆలేరు గ్రామంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు గన్న నాగయ్య కుమారుడి వివాహానికి హాజరై అనంతరం మాజీ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు న్యాయని సత్యపాల్ రెడ్డి స్వగృహంలో సమావేశాన్ని ఆదివారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నమ్ముకొని కొన్ని రోజుల నుండి పార్టీ అభివృద్ధికి కృషి చేస్తున్న కార్యకర్తలు ఎంతో ఇబ్బందులకు ఎన్నో సమస్యలు ఎదుర్కొని నేడు పార్టీ గెలుపు కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అని అన్నారు ప్రతి కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటారని అన్నారు త్వరలోనే మీకు సంబంధించిన భూమి సమస్యలు కూడా పరిష్కారం చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నాడని అన్నారు ప్రతి కార్యకర్తకు అండగా ఉంటానని హామీ ఇచ్చినట్లు తెలిపారు గ్రామానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు గన్న నాగయ్య కుమారుడి వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించే కార్యక్రమాన్ని నిర్వహించారు అనంతరం చీకటి కిరణ్ అశ్విని పుత్రిక చీకటి సాయి ప్రియ పుట్టినరోజు వేడుకలు పురస్కరించుకొని ఎమ్మెల్యే డాక్టర్ మురళి స్వయానా కేక్ కట్ చేసి మిఠాయిలు తినిపించి సంబరాలు నిర్వహించారు అనంతరం మాజీ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు నాయిని సత్యపాల్ రెడ్డి స్వగృహంలో డాక్టర్ నాయక్ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మొదటిసారిగా ఆ గ్రామానికి వచ్చిన సందర్భంగా కాంగ్రెస్ కార్యకర్తలు శాలులతో ఘనంగా సత్కరించి పుష్పగుచ్చాలిచ్చి శుభాకాంక్షలు తెలిపారు మరియు డీలర్ల సంఘం నాయకులు శాలువాతో ఘనంగా సన్మానించి భూకే ఇచ్చి శుభాకాంక్షలు తెలిపే కార్యక్రమం నిర్వహించారు మరియు అంగన్వాడి టీచర్లు నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్ శాల తో ఘనంగా సత్కరించి భూకే ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు మరియు మండల సిఏల సంఘం నుంచి వివిధ గ్రామాల ఐకెపి. సి ఏ లతో కలిసి ఎమ్మెల్యే మురళి నాయక్ శాలువాతో ఘనంగా సత్కరించి పుష్ప గుజ్జు సంబంధించి శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ జల్ల వెంకటేష్ స్థానిక ఎంపీటీసీ షైనాజ్ నజీమ్ గ్రామ శాఖ అధ్యక్షుడు కాలేరు మల్లేశం ఆ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు బాలాజీ నాయక్ ప్రధాన కార్యదర్శి కాసం లక్ష్మారెడ్డి నైనాల ఎంపిటిసి గుట్టయ్య గౌడ్ యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గోగుల అశోక్ యాదవ్ నాయకులు కోరే శ్రీనివాస్ ఎస్కే గౌస్ చీకటి కిరణ్ వివిధ గ్రామాల గ్రామ శాఖ అధ్యక్షులు అంగన్వాడి టీచర్లు ఆయాలు వివిధ గ్రామాల సిఏలు వివిధ గ్రామాల డీలర్లు ప్రజా ప్రతినిధులు కార్యకర్తలు పాల్గొన్నారు.