నవతెలంగాణ – రెంజల్
రెంజల్ మండలం సాటాపూర్ చౌరస్తాలో ప్రభుత్వం రుణమాఫీ ప్రకటన కాంగ్రెస్ వర్గీయులలో ఆనందోత్సవాలతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం సాటాపూర్ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ల చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతుల పక్షపాతి అని, వారి సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం రుణమాఫీ చేయడానికి ముందుకు వచ్చిందని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మోబిన్ ఖాన్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు జి.సాయిరెడ్డి, ధనుంజయ్, సిహెచ్ రాములు, నురేందర్ గౌడ్, సాయిబాబా గడ్, ఎమ్మెల్ రాజు. గంగా కృష్ణ, నరసయ్య,కార్తీక్ యాదవ్, సంజీవ్, సోక్కుల సాయిలు, కుద్దూస్, సద్దాం, యువజన నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.