నవతెలంగాణ – కంటేశ్వర్
ప్రజా సమస్యలపై పోరాటాలే ప్రభుత్వాలను కదిలిస్తాయి అని సీపీఐ(ఎం) కార్యకర్తల సమావేశంలో నాయకులు పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆదివారం సీపీఐ(ఎం) పార్టీ కార్యాలయంలో నగర పార్టీ కార్యకర్తల విస్తృత సమావేశం నిర్వహించటం జరిగింది. ఈ సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శి రమేష్ బాబు, కార్యదర్శివర్గ సభ్యులు పెద్ద వెంకట్ రాములు మాట్లాడుతూ.. పెట్టుబడిదారీ అనుకూల విధానాల మూలంగా పేదరికం మరింత పెరిగి అంతేగాని డొక్కాడని పేదల సమస్యలు పరిష్కారం చేయటంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయని అందువల్ల సమస్యలపై పోరాటాల ద్వారా మాత్రమే ప్రభుత్వాలను వంచగలుగుతామని వారు అన్నారు. పేదలకు అవసరమైన కూడు, గూడు, గుడ్డ కల్పించడంలో సరైన విధానాలు అనుసరించకపోవడంతో ఉపాధి అవకాశాలు తగ్గిపోయి పేదరికం పెరిగిపోతుందని ప్రజల జీవన ప్రమాణాలు పడిపోతున్నాయని వాటి నుంచి ప్రజల దృష్టిని మరల్చటానికి ప్రజల్లో వైశాల్యాలను పెంచి రాజకీయ లబ్ధి పొందాలని మతతత్వ విధానాలను అధికారాన్ని నిలబెట్టుకోవటానికి బిజెపి ప్రయత్నిస్తున్నదని విమర్శించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో కమ్యూనిస్టులు బలపడినప్పుడే ప్రభుత్వాలను కలుగుతామని అందుకు కష్టజీవులను ఐక్యం చేయాలని వారు అన్నారు. కేరళలో వచ్చిన వరదల మూలంగా వేలాది కుటుంబాలు నిరాశ్రయులుగా మారారని వందలాది మంది ప్రాణాలు కోల్పోయారని, అనేకమంది జాడ ఇంకా లభించలేదని, వారిని ఆదుకోవటానికి మానవతావాదులు ప్రజలు సహకరించాలని కోరారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా నాయకులు సుజాత, విగ్నేష్, నగర నాయకులు కటారి రాములు, అనసూయ, నరసయ్య, రూరల్ నియోజకవర్గం లక్ష్మి, గోవర్ధన్, శంకర్ తదితరులు పాల్గొన్నారు.