నవతెలంగాణ-మంగపేట
15 రోజులుగా గ్రామపంచాయతీ కార్మికులు చేస్తున్న సమ్మె పట్ల ప్రభుత్వ వైఖరి దారుణంగా ఉందని అంబేద్కర్ యువజన సంఘాల సీనియర్ నాయకుడు, మాజీ సర్పంచ్ పగిడిపల్లి వెంకటేశ్వర్లుఅన్నారు. గురువారం అంబేద్కర్ యువజన సంఘాల నాయకులు బసారికారి హరికృష్ణ ఆధ్వర్యంలో గంగర్ల రాజరత్మం, పళ్ళికొండ యాదగిరి, కర్రీ శ్యాంబాబు, ఎల్.ముత్యాలు, దీగొండ కాంతారావు, యెంపెల్లి వీరస్వామిలు పంచాయతీ కార్మికుల దీక్షా శిభిరానికి హాజరై తమ మద్దతు తెలిపారు. ఈ సందర్బంగా పగిడిపల్లి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ 15 రోజులుగా గ్రామ పంచాయతీ కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేస్తున్నా బీఆర్ఎష్ ప్రభుత్వం ‘దున్న పోతు మీద వాన పడ్డ చందం’గా వ్యవహరించడం దారుణమన్నారు. గ్రామపంచాయతీ కార్ముకుల న్యాయమైన డిమాండ్లైన కనీస వేతనం18 వేలు, ప్రభుత్వం ఉద్యోగులుగా గుర్తించడం, మల్టిపర్పస్ వర్కర్స్ అనే పదాన్ని తొలగించి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడం, గ్రామపంచాయతీలకు వ్యతిరేకంగా ఉన్న 59జీవోను రద్దు చేయడం వంటి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. లేని పక్షంలో అంబేద్కర్ సంఘం, దళిత, ప్రజా సంఘాలు, అఖిల పక్ష రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో ఆందోళనలు ఉద్రుతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో దాసరి ఎల్లయ్య, యెంపెల్లి మల్లేష్, గుగ్గిళ్ల సురేష్, సాంబశివరావు, బాబు, బూర్గుల సత్తిష్, బోడ సతీష్, బోడ రామచంద్రం, కిరణ్ లు పాల్గొన్నారు.