కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వాలు విఫలం

– సీఐటీయూ జిల్లా కార్యదర్శి పి రామకృష్ణ
– రేపటి నుండి జీపీ కార్మికుల సమ్మె
నవతెలంగాణ-పూడూరు
గ్రామ పంచాయతీల్లో పనిచేస్తున్న కార్మికుల సమస్య లు పరిష్కరించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని సీఐటీయూ జిల్లా కార్యదర్శి పి.రామకృ ష్ణ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలో జులై 6న చేపట్టబోయే జీపీ కార్మికుల సమ్మె నోటీస్‌ అధికారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాల్లో పని ఒత్తిడితో కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడు తున్నారన్నారు ప్రభుత్వం ఇచ్చిన జీఓ నెంబర్‌ 60 ప్రకారం ప్రతి కార్మికులకూ వేతనాలు పెంచాలన్నారు. గ్రామాలు పరిశుభ్రంగా బాగుండాలంటే కార్మికుల బతుకులు బాగుం డాలన్నారు. జీపీలో పనిచేస్తున్న కార్మికులకు సంవత్సరం లో మూడు జతల యూనిఫామ్‌లు డబ్బులు నూనెలో అం దజేయాలని డిమాండ్‌ చేశారు. కొన్ని గ్రామాల్లో కార్మికులు వివక్షకు గురవుతున్నారని కష్టపడి పని చేస్తున్న కార్మికులకు తగిన గౌరవం ఇవ్వాలన్నారు. అన్ని గ్రామాల్లో ప్రజా ప్రతి నిధుల అధికారుల ఒత్తిడి వల్ల కొన్ని గ్రామాల్లో కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని వారికీ సరైన భద్రత కల్పించా లన్నారు. అనంతరం ఎంపీడీవోకు సమ్మె నోటీస్‌ అందజేసి వాల్‌పోస్టర్‌ విడుదల చేశారు. కార్యక్రమంలో రమేష్‌ న ర్సింలు బంధ్యయ్య, చిన్నయ్య, రామయ్య దేవిజ తదిత రులు పాల్గొన్నారు.