ప్రభుత్వ భూమిని పేదలకు పంచడంలో ప్రభుత్వ విఫలం : సీపీఎం

నవతెలంగాణ-బచన్నపేట
నిరుపేదలకు ఇండ్ల స్థలాలు ఇవ్వడంలో తెలంగాణ ప్రభత్వం పూర్తీగా విఫల మైందని సీపీఎం ఆరోపించింది. మంగళవారం మండల కేంద్రంలోని తహసీల్దర్‌ కార్యాలయంలో గోపాల్‌నగర్‌ గ్రామంలోని నిరుపేద కుటుంబాలకు చెందిన 200 మంది తహసీల్దర్‌ కార్యాలయం ఎదుట నిరుపేద కుటంబాలు 6గంటల పాటు ధ ర్నా నిర్వహించారు. ప్రభుత్వ భూమిని తమకు కాకుండా అధికారంలో నాయకు లకూ అప్పనంగా అప్ప చెప్పడానికీ ఇక్కడి ఆధికారులు చూస్తున్నారని సంబధిత కుటుంబాలు ఆరోపించారు.ఇప్పటికైన 174 సర్వే నెంబర్లలో గల భూమిని నిరు పేదలకు ఇల్లు కట్టుక్కోవడానికి అనుమతించాలని లేకపోతే అన్ని సంఘాల నాయ కులను కలుపుకొని ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా సీపీఎం మండల కారయదర్శి బెల్లంకొండ వెంకటేశ మాట్లాడుతూ అధికారంలో ఉన్న పార్టీ నాయకులు, కార్యకర్తలకు పోలీస్‌ సిబ్బంది, రెవిన్యూ అధి కారులు ఇక్కడ ఉన్న ప్రభుత్వ భూమిని దానం చేయడం కోసం తహ తహ లాడు తున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో రామగల అశోక్‌, పర్వతం నరసిం హులు, కడకంచి బాలరాజు, పత్తి యాదగిరి, కడకంచి లక్ష్మీపతి పాల్గొన్నారు.