అంగన్‌వాడీలను విస్మరిస్తున్న ప్రభుత్వాలు

– పెంచిన జీతాలివ్వకుండా బడ్జెట్‌లో నిధుల కోత
– ఐసీడీఎస్‌ పరిరక్షణ కోసం సమరశీల పోరాటాలు
– 10న కలెక్టరేట్‌ ముట్టడిని జయప్రదం చేయండి
– అంగన్‌వాడీ టీచర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జయలకిë
నవతెలంగాణ-నల్లగొండ కలెక్టరేట్‌
కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని బీఆర్‌ఎస్‌ ప్రభుత్వాలు అంగన్‌వాడీ లను పూర్తిగా విస్మరిస్తున్నాయని తెలంగాణ అంగన్‌వాడీ టీచర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.జయలకిë ఆవేదన వ్యక్తం చేశారు. ఐసీడీఎస్‌ పరిరక్షణకై అంగన్‌వాడీ ఉద్యోగులు సమరశీల పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా అంగన్‌వాడీ టీచర్స్‌ హెల్పర్ల సమస్యల పరిష్కారం కోరుతూ ఈనెల 16న ఆదిలాబాద్‌ జిల్లాలో ప్రారంభమైన జీపుజాతా శనివారం నల్లగొండ జిల్లా కేంద్రానికి చేరుకుంది. జిల్లా కేంద్రంలోని యూటీఎఫ్‌ కార్యాలయంలో జరిగిన సభలో జయలకిë మాట్లాడారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకొచ్చి 9 ఏండ్లవుతున్నా అంగన్‌వాడీ ఉద్యోగుల సమస్యలు పరిష్కారానికి నోచుకోలే దన్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా ఉద్యోగుల జీతాలు పెంచలేదని ఆవేదన వ్యక్తం చేశారు. 2018లో టీచర్లకు రూ.1500, హెల్పర్లకు రూ. 750, మినీ వర్కర్లకు రూ.1250పెంచినట్టు చెప్పినా బడ్జెట్‌ నుంచి ఐసీడీఎస్‌కు 40 శాతం నిధులు తగ్గించడం వల్ల రాష్ట్ర ప్రభుత్వాలు వీటిని చెల్లించడం సాధ్యం కాదని చెబుతున్నాయని తెలిపారు. బడ్జెట్‌ తగ్గించడం వల్ల ఐసీడీఎస్‌ సేవలకు అంతరాయం కలుగుతుందని, పక్కా భవనాలు, పోషకాహారం, సెంటర్‌ అద్దెలు, మెస్‌చార్జీలు, ఖాళీ పోస్టులు తదితర సమ స్యలు పెండింగ్‌లో ఉన్నాయని చెప్పారు. అలాగే 2013లో 45వ ఇండియన్‌ లేబర్‌ కాన్ఫరెన్స్‌ స్కీంవర్కర్లను కార్మికులుగా గుర్తించాలని, కనీస వేతనం, ఈఎస్‌ఐ, పెన్షన్‌, ఉద్యోగ భద్రత కల్పించాలని తీర్మానం చేసింది కానీ ఇప్పటికీ అమలు చేయడం లేదన్నారు. నూతన విద్యావిధానం పాలసీ ద్వారా కేంద్రం ఐసీడీఎస్‌ వ్యవస్థను నిర్వీర్యం చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.
సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి మాట్లాడుతూ.. కార్మికులు పోరాడి సాధించుకున్న కార్మికుల చట్టాలను కేంద్ర ప్రభుత్వం నాలుగు కోడ్‌లుగా మార్చిందని, వాటిని వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా జీపుజాతా సందర్భంగా వచ్చిన సమస్యలపై సెక్టారు ప్రాజెక్టుల వారీగా సమావేశాలు జరుపుకొని సీడీపీఓలకు, టీడబ్ల్యూఓ అధికారులకు వినతిపత్రాలు ఇవ్వాలన్నారు. జులై 10 కోరికల దినోత్సవం సందర్భంగా అంగన్వాడీ ఉద్యోగులందరూ జిల్లా కలెక్టరేట్‌ ముట్టడి చేయా లని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కోశాధికారి బాణా ల పరిపూర్ణచారి, జిల్లా సహాయ కార్యదర్శి దండంపల్లి సత్తయ్య, ఉపాధ్య క్షులు నారబోయిన శ్రీనివాస్‌, జిల్లా కమిటీ సభ్యులు అద్దంకి నర్సింహ, అంగన్వాడీ యూనియన్‌ నాయకులు కె.విజయలక్ష్మీ, బి.పార్వతి, నాగమణి, ప్రమీల, రత్నకుమారి, ప్రకతాంబ, మణిరూప, ప్రమీల, వాణి పాల్గొన్నారు.