గ్రామాల అభివృద్దే ప్రభుత్వ ధ్యేయం: ఎమ్మెల్యే

నవతెలంగాణ – తుర్కపల్లి
గ్రామాల అభివృద్ధి ప్రభుత్వ ధ్యేయమని ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య అన్నారు .మంగళవారం తుర్కపల్లి మండలం కొండాపురం, వెంకటాపూర్ గ్రామాల్లో సిడిపి నిధుల ద్వారా నిర్మించిన ఎస్సీ కమ్యూనిటీ హాళ్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం తోనే గ్రామాల అభివృద్ధి సాధ్యమని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేసి తీరుతామని అన్నారు. ఆలేరు నియోజకవర్గం లోని అన్ని గ్రామాల్లో ఉన్న సమస్యలను తెలుసుకొని  సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ భూక్య సుశీల రవీందర్ నాయక్ ,ఎంపీడీవో మానే ఉమాదేవి, ఎంపీటీసీలు కానుగంటి శ్రీనివాస్ యాదవ్ ,మోహన్ బాబు నాయక్ ,సర్పంచు కల్లూరి ప్రభాకర్ రెడ్డి ,డొంకని మల్లేష్ యాదగిరిగుట్ట ఎంపీపీ చీర శ్రీశైలం, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు గుడిపాటి మధుసూదన్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి కొమ్మిరిశెట్టి నరసింహులు, ఆలేరు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ధనావత్ శంకర్ నాయక్, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ చాడ భాస్కర్ రెడ్డి, యాదగిరిగుట్ట మండల పార్టీ అధ్యక్షుడు కానుగు బాలరాజ్, ఓ బి సి జిల్లా ప్రధాన కార్యదర్శి పవన్ రాజ్, జిల్లా ఎస్టీ సెల్ అధ్యక్షుడు భాస్కర్ నాయక్, గ్రామ శాఖ అధ్యక్షులు కొనే దుర్వాసులు, దొమ్మాట బాబు, సోమోల్ల వెంకటేష్, బాలు యాదవ్, శ్రీరామ్ మూర్తి, శివరాత్రి జహంగీర్, వల్లపు రమేష్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు