– 10 ఏళ్లలో రూ.15లక్షల కోట్లు మాఫీ చేసిన బీజేపీ ప్రభుత్వం
– వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు
నవతెలంగాణ – అచ్చంపేట
ప్రజల సొమ్మును పెట్టుబడిదారులకు నరేంద్ర మోడీ ప్రభుత్వం దోచిపెడుతుందని, ముఖేష్ అంబానీ గౌతమ్ అంబానీ ఇతర పెట్టుబడిదారులకు 10 ఏళ్లలో రూ.15 లక్షల కోట్లు మొండిబకాయల కింద మాఫీ చేయడం జరిగిందని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు తెలిపారు. పట్టణంలోని బాబు జగ్జీవన్ రావు భవనంలో రెండవ రోజు కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా జిల్లా స్థాయి సామాజిక శిక్షణ తరగతులు జరుగుతున్నాయి. సామాన్య ప్రజలు నుంచి ప్రభుత్వాలు పెట్టుబడుదారులు ఏ విధంగా దోపిడీ చేస్తున్నారు అనే అంశంపై ఆయన బోధించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జియో నెట్వర్క్, ఎయిర్టెల్ నెట్వర్క్, ఇలా అనేక ప్రైవేట్ నెట్వర్క్ కంపెనీలు సామాన్య ప్రజల నుండి వేల కోట్లు దోపిడీ చేస్తున్నా.. ప్రభుత్వాలు ఎందుకు ప్రశ్నించడం లేదన్నారు. జియో కంపెనీ రీఛార్జి ఫీజులు పెంచారని, దీని ద్వారా ఒక్క మే నెల ఆదాయం రూ.7500 కోట్లు వచ్చినట్లు ఆయన తెలిపారు. జియో నెట్ వర్క్ మార్కెట్లోకి తీసుకురావడానికి అంబానీ రూ.1170 కోట్లు బ్యాంకుల ద్వారా అప్పులు తీసుకున్నారు. 15 ఏళ్లు అవుతున్నా.. నేటికీ బకాయలు చెల్లించడం లేదన్నారు. అంబానికి రూ.3 లక్షల కోట్లు, గౌతం అంబానికి రూ.5 లక్షల కోట్లు, మరో ఇతరులకు మొత్తం 10ఏళ్లలో రూ.15 లక్షల కోట్లు మొండిబకాయిలు చూపిస్తూ.. నరేంద్ర మోడీ ప్రభుత్వం పెట్టుబడిదారులకు మాఫీ చేసిందని గుర్తు చేశారు. సహజ వనరుల సైతం కార్పొరేట్ సంస్థలకు దోచిపెడుతుందన్నారు. సహజ వనరుగా భూమిలో లభించే బొగ్గు ప్రైవేట్ కంపెనీలకు అప్పగించారు. ప్రభుత్వం సేకరించినప్పుడు టన్ను విలువ రూ.4 వేల రపాయలు ఉంటే, ఈరోజు ప్రైవేట్ కంపెనీకి అప్పగించిన తర్వాత టన్ను విలువ 30 వేలకు విక్రయిస్తున్నారని అన్నారు. పేదలకు ఇండ్ల స్థలం ఇవ్వడానికి పాలకులకు, ప్రభుత్వాలకు ఇష్టం ఉండదు. కానీ మందుల కంపెనీలకు వేల ఎకరాలు ధారా దత్తం చేయడానికి ఆసక్తి చూపుతున్నారని అన్నారు. ప్రత్యక్షంగా పరోక్షంగా సామాన్య ప్రజలను సొమ్మును బడా కార్పొరేట్ కంపెనీలు దోచుకుంటున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు ప్రశ్నించడం లేదన్నారు. దోపిడీకి వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాలు నిర్వహించాలని, ప్రతి ఒక్కరు చైతన్యవంతమై దోపిడీ దారి నుంచి బయటపడే మార్గాలు ప్రయత్నాలు తెలుసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో కేవీపీఎస్ జిల్లా అధ్యక్షులు కాశన్న, కార్యదర్శి పరశురాములు, ఉపాధ్యక్షులు గుండె మల్లేష్, రైతు సంఘం జిల్లా నాయకులు దేశనాయక్, సీఐటీయూ నాయకులు ఎస్ మల్లేష్, గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి శంకర్ నాయక్, ఆంజనేయులు, హనుమంతు, రాజు నిర్మల , రజిత తదితరులు ఉన్నారు.