ప్రజాహితం కోరి ప్రభుత్వాలు పనిచేయాలి

– ట్రస్ట్‌ చైర్మన్‌ భిక్షపతి యాదవ్‌
– సందయ్య మెమోరియల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో కంటి పరీక్షలు
నవతెలంగాణ-శేరిలింగంపల్లి
ప్రజల చేత, ప్రజలకు ఎన్నుకోబడిన ప్రభుత్వాలు ప్రజాహితం కోరి పనిచేయాలని, ప్రజాసేవ చేస్తూ ప్రజల మన్నలను పొందాలని ట్రస్ట్‌ చైర్మన్‌ భిక్షపతి యాదవ్‌ అ న్నారు. గచ్చిబౌలి డివిజన్‌ రాయదుర్గం వార్డ్‌ కార్యాల యంలో సందయ్య మెమోరియల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో కంటి పరీక్షా శిబిరాన్ని ప్రారంభించి 400 మందికి కంటి అద్దాల ను పంపిణీ చేశారు. ప్రజల ఆకాంక్ష మేరకు ట్రస్టు కార్య క్రమాలు సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని గతంలో నూ ట్రస్టు ద్వారా అనేక కార్యక్రమాలు చేపట్టి ప్రజల పక్షా న నిలిచామని రాబోయే రోజుల్లోనూ ప్రజలకు సేవ చేస్తా మన్నారు. ప్రజా సేవే లక్ష్యంగా ప్రజల సంక్షేమం కోసం ఆలోచిస్తూ వారికి కావలసిన మౌలిక సదుపాయాలను సమకూర్చడంలో సందయ్య మెమోరియల్‌ ట్రస్ట్‌ సేవలు అమోఘమని గచ్చిబౌలి డివిజన్‌ కార్పొరేటర్‌ గంగాధర్‌ రెడ్డి అన్నారు. కార్యక్రమంలో కృష్ణ యాదవ్‌, నరేందర్‌ ముదిరాజ్‌, కృష్ణ ముదిరాజ్‌, ఈగ సుధాకర్‌, నరేందర్‌ యాదవ్‌, అశోక్‌, దయాకర్‌, రమేష్‌ యాదవ్‌, శ్యామ్‌ యాదవ్‌, సామ్రాట్‌ గౌడ్‌, హనుమంతు నాయక్‌, మల్లేష్‌ రెడ్డి, సందీప్‌ రెడ్డి, వెంకటేష్‌ తదితరులున్నారు.