
నవతెలంగాణ-గోవిందరావుపేట
పంచాయతీ కార్మికుల సమస్యల పరిష్కారం పై రాష్ట్ర ప్రభుత్వం మొండివైఖరి అవలంబిస్తుందని బిఎస్పి పార్టీ ములుగు జిల్లా ఇన్చార్జ్ పసులాది ముఖేష్ అన్నారు. సోమవారం మండల కేంద్రంలో గ్రామపంచాయతీ కార్మికులు తమ సమస్యల పరిష్కారం కోసం నిర్వహిస్తున్న సమ్మె ఐదవ రోజుకు చేరిన సందర్భంగా బీఎస్పీ పార్టీ తరఫున కార్మికుల సమ్మెకు పూర్తి మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా కార్మికుల ఉద్దేశించి ముఖేష్ మాట్లాడుతూ పంచాయతీ కార్మికులను వెంటనే రెగ్యులర్ చేయాలి, మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు.బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నాయకత్వంలో టిఎస్ పిఎస్ సి రద్దు కోసం ఏ విధంగానైతే పోరాటం చేసినామో, పంచాయతీ కార్మికుల కోసం కూడా పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని పేర్కొన్నారు. పంచాయతీ కార్మికుల సమ్మెకు సంపూర్ణ మద్దతు తెలుపుతూ తెలంగాణలో బి.ఎస్.పి అధికారం లోకి రాగానే పరిశుద్ద కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులు ఇస్తామని చెప్పడం జరిగింది. అలాగే ఆదివారం రోజు సర్పంచ్ లావుడ్య లక్ష్మి భర్త జోగ నాయక్ గారు పరిశుద్ద కార్మికుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తు వారిని చిన్న చూపు చూస్తూ కావాలని వారిపైన తప్పుడు కేసు పెట్టాలని పిర్యాదు చేసి గోవిందరావుపేట నుండీ పస్ర పోలీస్ స్టేషన్ వరకు కి, మీ నడిపించిన తీరును ఖండిస్తున్నామని కార్మికులకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని పసులాది ముఖేశ్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బి ఎస్ ఎఫ్ ములుగు జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ సంఘీ సందీప్, బి.వి.ఎఫ్ ములుగు జిల్లా కన్వీనర్ వావిలాల కిషోర్ కుమార్ , బివిఎఫ్ కన్వీనర్ గడ్డం ప్రవీణ్, మహేష్, ఉదయ్ శంకర్ మరియు పంచాయితీ సిబ్బందులు పాల్గోన్నారు.