సీఐటీయూ మండల కన్వీనర్ చందునాయక్
నవతెలంగాణ-యాచారం
గ్రామపంచాయతీలో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికుల సంక్షేమాన్ని రాష్ట్ర ప్రభుత్వం పాత రేసిందని సీఐటీయూ మండల కన్వీనర్ చందు నాయక్ విమర్శించారు. గురువారం ఎంపీడీవో ఆఫీస్ ఎదుట పంచాయతీ కార్మికులు చేస్తున్న నిరవధిక సమ్మె ఎనిమిదో రోజుకు చేరుకుంది. అనంతరం కార్మికులంతా కలిసి మండల ఆఫీస్ నుంచి యాచారం అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేతనాలు పెంచాలని కార్మికులు చేస్తున్న సమ్మెను ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదని విమర్శించారు. వారంతా ఎస్సీ, ఎస్టి, బలహీన వర్గాలకు చెందిన పేదలేనని, వారి ఆరోగ్యం లెక్క చేయకుండా ప్రజల ఆరోగ్యాలను కాపాడడానికి పనిచేస్తున్నారని తెలిపారు. ఇప్ప టికైనా ప్రభుత్వం పంచాయతీ కార్మికులందరికీ కనీస వేతనాలు అమలు చేయా లని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కారోబార్లు నరేందర్, కృష్ణ, లింగం, రవి, పరమేష్, లింగం, శరణం, జగన్, వెంకటేష్, మహేందర్, పెంటయ్య, జంగయ్య, పారిశుధ్య కార్మికులు తదితరులు పాల్గొన్నారు.