గవర్నర్ దత్తత, కొండపర్తి గ్రామ అభివృద్ది పనులు త్వరగా పూర్తి చేయాలి

– ములుగు జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్
– కొండపర్తి గ్రామాన్ని సందర్శించి, పరిశీలించిన కలెక్టర్
నవతెలంగాణ -తాడ్వాయి
గవర్నర్ దత్తత తీసుకున్న గిరిజన గ్రామమైన “కొండపర్తి” అభివృద్ది పనులు త్వరగా పూర్తి చేయాలని ములుగు జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ అధికారులను ఆదేశించారు. బుదవారం  జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్., గవర్నర్ విష్ణు దేవ్, జాయింట్ సెక్రెటరీ భవాని శంకర్, ప్రైవేట్ సెక్రటరీ పవన్ సింగ్ లతో కలిసి రాష్ట్ర గవర్నర్ దత్తత తీసుకున్న తాడ్వాయి మండలంలోని కొండపర్తి గ్రామంను సందర్శించి, పరిశీలించారు.
ఈ సందర్భంగా గ్రామంలో జరుగుతున్న స్కిల్ డెవలప్మెంట్ సెంటర్,  సోలార్ ఆర్గనైజింగ్ సిస్టం, మసాలా మేకింగ్,  టైలరింగ్ సెంటర్, స్కూల్, అంగన్వాడి భవనాల కాంపౌండ్ వాల్,  టాయిలెట్స్ , వాటర్ సప్లై  తదితర అభివృద్ధి పనులను పరిశిలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ గ్రామములో  79 బిపిఎల్ గృహాలు ఉన్నాయని, 370 మంది జనాభా జీవనోపాధి  మెరుగుపర్చుటకు వ్యయసాయం చేసుకొనుటకు 10 ఎకరాల వ్యవసాయ భూమిలో ఒక  బోర్ వేయుటకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ వెంకటేష్, ట్రైబల్ వెల్ఫేర్ ఈ ఈ వీరభద్రం, మండల ప్రత్యేక అధికారి, వ్యవసాయ శాఖ అధికారి సురేష్ కుమార్, తహసిల్దార్, ఎంపీడీవో సుమన వాణి, సంబంధిత అధికారులు, గ్రామ ప్రజలు,  తదితరులు పాల్గొన్నారు.