– మాజీ మంత్రి హరీశ్ రావు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళిసై కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని మాజీ మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకంలో కాంగ్రెస్, బీజేపీల మధ్య ఉన్న అవగాహన బట్టబయలైందని తెలిపారు. ”రాజకీయ పార్టీల్లో కొనసాగుతున్నారనే కారణంతో గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం సిఫారసు చేసిన అభ్యర్థులను ఎమ్మెల్సీలుగా నియమించడానికి గవర్నర్ నిరాకరించారు. కాని కాంగ్రెస్ ప్రభుత్వం ఏకంగా ఓ రాజకీయ పార్టీ అధ్యక్షుడినే సిఫారసు చేస్తే ఆమోదించారు. ఇది ద్వంద్వ నీతి కాదా?” అనిఎక్స్ వేదికంగా హరీష్ విమర్శలు గుప్పించారు.